ఉస్మానియా యూనివర్సిటీ రికార్డు… కరోనా కాలంలోనూ తరగతుల నిర్వహణ… పరీక్షలు… ఫలితాలు….

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వేళ ఉస్మానియా విశ్వవిద్యాలయం రికార్డును నెలకొల్పింది. కష్టమైనా.. విద్యార్థులకు నష్టం కలుగకుండా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించింది. విద్యార్థులు అకడమిక్ ఇయర్ నష్టపోకుండా చేసింది. 

ఉస్మానియా యూనివర్సిటీ రికార్డు... కరోనా కాలంలోనూ తరగతుల నిర్వహణ... పరీక్షలు... ఫలితాలు....
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 17, 2020 | 8:03 AM

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వేళ ఉస్మానియా విశ్వవిద్యాలయం రికార్డును నెలకొల్పింది. కష్టమైనా.. విద్యార్థులకు నష్టం కలుగకుండా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించింది. విద్యార్థులు అకడమిక్ ఇయర్ నష్టపోకుండా చేసింది.  పలు కోర్సులకు సెలబస్ పూర్తి చేసి… పరీక్షలు నిర్వహించింది. తాజాగా  ఫలితాలను విడుదల చేసింది. యూజీ స్థాయిలోనే మూడు లక్షలకుపైగా విద్యార్థులు ఉన్న వర్సిటీల్లో సుమారు మూడునెలల్లో అన్నిరకాల పరీక్షలు పూర్తిచేసిన తొలి వర్సిటీగా దేశంలోనే అరుదైన గౌరవాన్ని ఉస్మానియా యూనివర్సిటీ సాధించింది.

పరీక్షల నిర్వహణ…

కరోనా కారణంగా‌ లాక్‌డౌన్తో మార్చి వచ్చింది. దీంతో మార్చి, ఏప్రిల్‌లో జరుగాల్సిన పరీక్షలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. అన్‌లాక్‌ ప్రారంభమయ్యాక కోర్సు ముగియనున్న విద్యార్థులకు (డిగ్రీ చివరి సంవత్సరం ఆఖరి సెమిస్టర్‌, పీజీ రెండో సంవత్సరం చివరి సెమిస్టర్‌) కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించారు. 321 కోర్సులకు నిర్వహించిన పరీక్షలకు 5,07,306 మంది విద్యార్థులు హాజరయ్యారు. 90శాతానికి పైగా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశారు. 59 కోర్సుల పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభంకాగా, వీటికి 55,585 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పలు పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. త్వరలోనే మిగిలిన కోర్సుల పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, అందరి సహకారంతోనే పరీక్షల నిర్వహణ సాధ్యమైతోందని కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌, ఓయూ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ తెలిపారు.