
ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌ను నిరసిస్తూ.. విద్యార్థి సంఘాలు ఇవాళ ఉస్మానియా యూనివర్శిటీ బంద్‌కి పిలుపునిచ్చాయి. ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్‌కు నిరసనగా బంద్ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓయూ పీఎస్, ఆర్ట్స్ కాలేజ్, ఎన్‌సీసీ గేట్ వద్ద పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. విరసం కార్యదర్శిగా ఉన్న ప్రొఫెసర్ కాశింను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన భార్య స్నేహలత డిమాండ్ చేశారు. మావోయిస్ట్ ముద్ర వేసి భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారంటూ ఆమె విమర్శించారు. కాశింకు మావోయిస్ట్ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయన్నది అవాస్తవమని, తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ కోరారు స్నేహలత.