
Former Naxalite Hulchul: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ఓ మాజీ నక్సలైట్ హల్‌చల్ సృష్టించాడు. కలెక్టర్‌ను కలవడానికి పెప్పర్ స్ప్రే జేబులో పెట్టుకొని వచ్చాడు. అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేసేసరికి జేబులోంచి పెప్పర్ స్ప్రే బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా ఎవరిపై అటాక్ చేయడానికి ఇతడు కలెక్టరేట్ వచ్చాడు. పెప్పర్ స్పే కథ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని గురించి ప్రశ్నించిన పోలీసులకు అతడు ఒకటే సమాధానం చెబుతున్నాడు. తన వ్యక్తిగత భద్రత కోసం పెప్పర్ స్ప్రే వాడుతున్నానని చెబుతున్నాడు. ఇతడు చెప్పే సమాధానం పోలీసులు నమ్మడం లేదు. వ్యక్తిగత భద్రతకు,పెప్పర్ స్ప్రేకు పొంతన కుదరక పోయేసరికి ఆ మాజీ నక్సలైట్‌ను పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.