లాక్‌డౌన్ అమలుపై రాష్ట్రాలకు కేంద్రం తాాజా ఆదేశం
ఏప్రిల్ 20వ తేదీ తర్వాత లాక్ డౌన్‌కు మినహాయింపులు వచ్చే దాకా ఈ ఆరు రోజులు మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు జరిగేలా చూడాలని ఆదేశాలిచ్చింది కేంద్రం. కేంద్ర కేబినెట్ క్యార్యదర్శి రాజీవ్ గౌబ ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

ఏప్రిల్ 20వ తేదీ తర్వాత లాక్ డౌన్‌కు మినహాయింపులు వచ్చే దాకా ఈ ఆరు రోజులు మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు జరిగేలా చూడాలని ఆదేశాలిచ్చింది కేంద్రం. కేంద్ర కేబినెట్ క్యార్యదర్శి రాజీవ్ గౌబ ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అదే సమయంలో ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొన్ని మినహాయింపులకు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాలో రాజీవ్ గౌబ ప్రధాన కార్యదర్శులకు సూచించారు.
కేబినెట్ కార్యదర్శి రాజీవ్ బుధవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మే 3 దాకా లాక్ డౌన్ కొనసాగింపు వెనుక ఉద్దేశాలను వారితో పంచుకున్నారు. ఈ వారం రోజులు అత్యంత కఠినంగా లాక్ డౌన్ అమలైతే ఆ తర్వాత దేశంలో కరోనా ప్రభావం నియంత్రణలోకి వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను రాజీవ్ ప్రధాన కార్యదర్శులకు వివరించారు.
ఈ ఆరు రోజులు అత్యంత పటిష్టంగా లాక్ డౌన్ అమలైతే.. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఇవ్వనున్న మినహాయింపులపై వీడియో కాన్ఫరెన్సులో చర్చించారు. వ్యవసాయం, వస్తు రవాణా, పరిశ్రమలు, గ్రామీణ నిర్మాణ రంగం, ఇరిగేషన్ నిర్మాణ పనులకు మినహాయింపులు ఇచ్చే అవకాశాలను వివరించారు.. అదే సమయంలో మినహాయింపుల ఇచ్చే రంగాల్లో ముందస్తుగా చేపట్టాల్సిన పనులను వీడియో కాన్ఫరెన్సులో చర్చించారు.
