పంజాబ్‌లోని లుథియానా రైల్వేస్టేషన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రైన్ ఎక్కబోతూ.. ఓ వ్యక్తి రైలు కింద పడిపోయాడు. కాలుజారి కిందపడటంతో అతడు స్పాట్‌లోనే చనిపోయాడు. సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ఓ వ్యక్తి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి రైలు ఎక్కడానికి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వ్యక్తి రైలు కిందపడిపోతుంటే ప్లాట్‌ఫామ్ మీద ఉన్న జనం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కళ్ల ముందే నిండు ప్రాణం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అక్కడి ప్రయాణికులు. రన్నింగ్ ట్రైన్ ఎక్కరాదని చాలా సార్లు విజ్ఞప్తి చేసినప్పటికి ఎవరూ.. పట్టించుకోవడం లేదని అధికారులు వాపోతున్నారు.