Omicron: తమిళనాడులో ఒమిక్రాన్‌ టెన్షన్.. విదేశాల నుంచి వచ్చినవారిలో 82మంది అనుమానితులు..

|

Dec 23, 2021 | 8:52 AM

Chennai Omicron: దేశంలో ఓ వైపు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న వేళ.. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య రోజు రోజుకీ  పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసుల..

Omicron: తమిళనాడులో ఒమిక్రాన్‌ టెన్షన్.. విదేశాల నుంచి వచ్చినవారిలో 82మంది అనుమానితులు..
Chennai Omicron
Follow us on

Chennai Omicron: దేశంలో ఓ వైపు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న వేళ.. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య రోజు రోజుకీ  పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసుల నమోదు పెరుగుతూ టెన్షన్‌ పెట్టిస్తోంది. తాజాగా తమిళనాడులో విదేశాల నుంచి వచ్చిన వారిలో భారీగా ఒమిక్రాన్‌ వైరస్ లక్షణాలు కనిపించాయి.. దీంతో సుమారు 82 మంది శాంపిల్స్‌ను వైద్య పరీక్షల నిమిత్తం బెంగుళూరు ల్యాబ్ కు పంపించారు. రిజల్ట్ ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే నైజీరియా నుంచి వచ్చిన రోగి ఒమిక్రాన్‌ నుంచి కోలుకుంటున్నాడని.. అయితే ఇప్పుడు పంపించిన శాంపిల్స్ లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యే అవకాశాలు ఉండడంతో వారిని కింగ్స్ ఆసుపత్రిలో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

బెంగళూరు నుంచి శాంపిల్స్‌ రిజల్ట్స్ ఈరోజు వచ్చే అవకాశం ఉందని వైద్య సిబ్బంది చెప్పారు. బుధవారం టాంజానియా నుంచి నెల్లైకు వచ్చిన యువకుడిలోనూ ఒమిక్రాన్‌ ఛాయలు వెలుగు చూశాయి. ఇక, కెన్యా నుంచి చెన్నై మీదుగా తిరుపతికి వెళ్లిన 39 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది. అక్కడ వైద్య సిబ్బంది అప్రమత్తమైంది.

ఇక తమిళనాడు సర్కార్ సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే వారికీ వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించేలా సరిహద్దుల్లో వైద్య బృందాలను స్టాలిన్ సర్కార్ నియమించింది. జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ మరో సారి హెచ్చరించారు.

మరోవైపు కీల్పాకం ఆస్పత్రిలో వైద్య సేవల వివరాల్ని పేర్కొంటూ, డిజిటల్‌ బోర్డుల్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఇదే తరహా బోర్డులో 25 ఆస్పత్రుల్లో వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని వైద్య శాఖ మంత్రి చెప్పారు. అంతేకాదు కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆస్పత్రుల్లోనూ చికిత్సకు తగిన చర్యలు తీసుకున్న్నామని.. ఒమిక్రాన్‌ లక్షణాలు కనిపించిన బాధితులను గుర్తించి వెంటనే తగిన చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

Also Read:   ఏపీని వణికిస్తున్న శీతల గాలులు.. వృద్దులు, చిన్నారులు జాగ్రత్త అంటున్న నిపుణులు..