ఆమె వయస్సు 68 ఏళ్ళు, అయినా చకచకా ఏం చేసిందో తెలుసా ?

ఆమె వయస్సు 68 ఏళ్ళు..అయితే ఏం ? రామా, కృష్ణా అంటూ ఇంట్లో ఓ మూలన కూర్చోలేదు. శారీరక పటుత్వానికి, పట్టుదలకు, మానసిక దృఢత్వానికి మించింది లేదని నిరూపించింది. మహారాష్ట్ర లోని నాసిక్ లో హరిహర కోటమీద ఎత్తయిన కొండమీదున్న పురాతన ఆలయాన్ని సందర్శించాలంటే శిథిలావస్థలో ఉన్న మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. రాళ్లతో కూడిన బండరాళ్లలాంటి మెట్లపై ఎక్కాలంటే సామాన్యులకే చాలా కష్టం. కానీ ఈ ముసలావిడ మాత్రం ఆ కష్టాన్ని ఇష్టంగా,సాహసంగా మలచుకుంది. రెండు చేతులకూ […]

ఆమె వయస్సు 68 ఏళ్ళు, అయినా చకచకా ఏం చేసిందో తెలుసా ?
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 12, 2020 | 4:04 PM

ఆమె వయస్సు 68 ఏళ్ళు..అయితే ఏం ? రామా, కృష్ణా అంటూ ఇంట్లో ఓ మూలన కూర్చోలేదు. శారీరక పటుత్వానికి, పట్టుదలకు, మానసిక దృఢత్వానికి మించింది లేదని నిరూపించింది. మహారాష్ట్ర లోని నాసిక్ లో హరిహర కోటమీద ఎత్తయిన కొండమీదున్న పురాతన ఆలయాన్ని సందర్శించాలంటే శిథిలావస్థలో ఉన్న మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. రాళ్లతో కూడిన బండరాళ్లలాంటి మెట్లపై ఎక్కాలంటే సామాన్యులకే చాలా కష్టం. కానీ ఈ ముసలావిడ మాత్రం ఆ కష్టాన్ని ఇష్టంగా,సాహసంగా మలచుకుంది. రెండు చేతులకూ గ్లోవ్స్ వంటివి ధరించి పాకుతున్నట్టుగా చక చకా ఆ మెట్లన్నీ ఎక్కేసింది. చివరకు పైకి చేరి చిరునవ్వులు చిందించింది. పైన ఉన్నవారంతా ఈలలు వేస్తూ ఆమెను అభినందించారు. ఈ వీడియోను మహారాష్ట్ర సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ దయానంద కాంబ్లే ట్విట్టర్లో షేర్ చేశారు. దీన్ని  చూసిన కొందరు ఆమెను ఆషా అంబాడే అనే మహిళగా గుర్తించారు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.