కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో మత సామరస్యం వెల్లివిరిసింది. చనిపోయిన ఓ 80 ఏళ్ల హిందూ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో ఆ ప్రాంతంలో ముస్లిం యువకులు ముందుకొచ్చారు. తల్లిలా ప్రేమించే ఆమె పాడెను మోసుకుని వెళ్లి హిందూ ఆచారాల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఆమె మృతదేహాన్ని భుజాన మోసుకుని శ్మశానవాటికకు తీసుకుని వెళ్లారు. వృద్ధురాలి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. హిందూ-ముస్లిం అంటూ ఏదో ఒక విధంగా రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చాలా మంది చూస్తున్నారు. అయితే అటువంటి భావన లేకుండా సహాయం చేసేందుకు మేము ఎప్పుడూ ముందుండి ఇతరులకు సహాయపడతాం అని ముస్లిం యువకులు అంటున్నారు.
మండల కేంద్రమైన గోనెగండ్లలో శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల ఆలయ సత్రం నందు ప్రతిరోజు భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు స్థానికులు. ఆమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన హిందూ వృద్ధురాలికిగా గుర్తించారు. ఆమెకు ఎవరూ లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ముస్లిం యువకులు అహ్మద్ హుస్సేన్, అచ్చుపట్ల ఖలీల్, కమల్ భాష, మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్, ముల్లావల్లి, అచ్చుగట్ల బాబు, తదితరులు ముందుకొచ్చారు. తల్లిలా ప్రేమించే ఆమె శవాన్ని మోసుకుని వెళ్లి హిందూ సాంప్రదాయ ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో మత సామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం యువకులను గోనెగండ్ల ప్రజలు అభినందించారు. భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేందుకు ఈ సంఘటన నిలువెత్తు నిదర్శనం అని చెబుతున్నారు స్థానికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..