గురుగ్రామ్‌లో.. ఓలా ఎమర్జెన్సీ సర్వీసులు ప్రారంభం..

| Edited By:

Apr 13, 2020 | 7:51 PM

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. గురుగ్రామ్ లోని వందకుపైగా ఉన్న ఆసుపత్రులకు నాన్-కోవిడ్ వైద్య ప్రయాణాల కోసం ‘ఓలా ఎమర్జెన్సీ’ పేరుతో

గురుగ్రామ్‌లో.. ఓలా ఎమర్జెన్సీ సర్వీసులు ప్రారంభం..
Follow us on

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. గురుగ్రామ్ లోని వందకుపైగా ఉన్న ఆసుపత్రులకు నాన్-కోవిడ్ వైద్య ప్రయాణాల కోసం ‘ఓలా ఎమర్జెన్సీ’ పేరుతో ప్రముఖ క్యాబ్ హైరింగ్ సంస్థ ఓలా ఎమర్జెన్సీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హర్యానా ప్రభుత్వ సహకారంతో ప్రారంభించిన ఈ సేవల్లో మాస్కులు, శానిటైజర్లతో కూడిన ప్రత్యేకమైన కార్లు ఉంటాయి. అలాగే, ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లు ఉంటారు. వినియోగదారులు యాప్ ద్వారా ‘ఓలా ఎమర్జెన్సీ’ని బుక్ చేసుకోవచ్చు.

కాగా.. నగరంలో అందుబాటులో ఉన్న ఆసుపత్రుల జాబితా నుంచి డ్రాపింగ్ స్థానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, ఈ సేవలు కోవిడ్ రహిత మెడికల్ ట్రావెల్‌కు మాత్రమే. ఈ సేవల కోసం వినియోగదారుల నుంచి నామమాత్రపు చార్జీలను వసూలు చేస్తారు. అలాగే, సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ఇటువంటి సేవలు ఇప్పటికే బెంగళూరు, వైజాగ్, భువనేశ్వర్, నాసిక్, వారణాసిలో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మరిన్ని నగరాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ఓలా తెలిపింది. అంబులెన్స్ అవసరం లేని వైద్యపరమైన ప్రయాణాలకు ఈ సేవలను వినియోగించుకోవచ్చని ఓలా అధికార ప్రతినిధి ఆనంద్ సుబ్రమణియన్ తెలిపారు.