నిన్న ఒక్క రోజే 520 మందిని బలి తీసుకున్న కరోనా మహమ్మారి

|

Nov 14, 2020 | 11:19 AM

దేశంలో నిన్న ఒకేరోజు 9,29,481 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి ప్ర‌క‌టించింది. న‌వంబ‌ర్ 13 నాటికి 12,40,31,230 న‌మూనాల‌కు క‌రోనా ప‌రీక్ష‌లుచేశామ‌ని తెలిపింది...

నిన్న ఒక్క రోజే 520 మందిని బలి తీసుకున్న కరోనా మహమ్మారి
Follow us on

దేశంలో కరోనా కరాల నృత్యం చేస్తోంది. శుక్రవారం ఉదయం శనివారం ఉదయం వరకు 520 మందిని కరోనా కబలించింది, ఇప్పటి వరకు క‌రోనా మృతుల సంఖ్య 1,29,188కి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది. అయితే దేశంలో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య‌ స్థిరంగా కొన‌సాగుతున్న‌ది.

శుక్రవారం  44,878 కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా నిన్న‌టికంటే 0.4 శాతం త‌క్కువ‌గా 44 వేల కేసులు రికార్డ‌య్యాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంటల్లో కొత్త‌గా 44,684 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసులు 87,73,479కు చేరాయి. ఇందులో 4,80,719 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 81,63,572 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న మ‌రో 47,992 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య నిన్న‌టికంటే 3,828 త‌గ్గాయి. కాగా, నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 520 మంది బాధితులు మ‌ర‌ణించారు.

దేశంలో నిన్న ఒకేరోజు 9,29,481 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి ప్ర‌క‌టించింది. న‌వంబ‌ర్ 13 నాటికి 12,40,31,230 న‌మూనాల‌కు క‌రోనా ప‌రీక్ష‌లుచేశామ‌ని తెలిపింది.