మెట్రో ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై వాటికి కూడా అనుమతి..!
మోటారు వాహనాల కంటే సైకిల్ రైడింగ్ ఆరోగ్యానికి ఎంతో బెటర్ అని పలు వైద్యులు చెబుతుంటారు. అందుకే ఎక్కువ శాతం మంది ప్రజలు సైకిల్‌పై...
మోటారు వాహనాల కంటే సైకిల్ రైడింగ్ ఆరోగ్యానికి ఎంతో బెటర్ అని పలు వైద్యులు చెబుతుంటారు. అందుకే ఎక్కువ శాతం మంది ప్రజలు సైకిల్‌పై ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే దేశంలో సైకిలిస్టుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే సైకిళ్లపై దూర ప్రయాణాలు చేసేవాళ్లు మాత్రం మెట్రో ఎక్కాలంటే కాస్త ఆలోచిస్తారు. మెట్రో స్టేషన్లలో పెడితే ఎక్కడ సైకిల్ పోతుందేమోనని వాళ్ల భయం. అయితే తాజాగా సైకిలిస్టులకు కేరళ ప్రభుత్వం ఓ తీపి కబురు అందించింది.
ఇకపై కొచ్చి మెట్రోలో సైకిళ్లకు కూడా తీసుకెళ్ళవచ్చునని తెలిపింది. అయితే ఈ వెసులుబాటును కేవలం ఆరు స్టేషన్లకు మాత్రమే పరిమితం చేసింది. చంగంపుఝా పార్క్, పాలరివత్తం, టౌన్‌హాల్, ఎర్నాకులం సౌత్, మహరాజా కాలేజి, ఎర్నాకులం మెట్రోస్టేషన్‌లలో ప్రయాణీకులు తమతో పాటు సైకిళ్లను మెట్రో ట్రైన్లలో తీసుకెళ్లొచ్చని ప్రకటించింది.
దీనిపై కేరళా మెట్రో అడిషనల్ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ.. ”ప్రస్తుతం ఆరు స్టేషన్లలో మాత్రమే ఈ వెసులుబాటును కల్పించామని.. ప్రజల నుంచి వచ్చే ఆదరణ ప్రకారం మరిన్ని స్టేషన్లకు విస్తరిస్తామని అన్నారు. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. ప్రస్తుతం సైకిలిస్టులు తమ వెంట తెచ్చుకున్న సైకిళ్లను తీసుకెళ్లేందుకు ఎలివేటర్లు వాడొచ్చని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
Cycle around the city to your heart’s content. Kochi Metro will allow commuters to carry their cycles with them on the Metro from tomorrow at six stations; Changampuzha Park, Palarivattom, Town Hall, Maharaja’s College, Ernakulam South and Elamkulam. #CyclesinMetro #MetroCares pic.twitter.com/iPAb9QRWPs
— Kochi Metro Rail (@MetroRailKochi) November 17, 2020