AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిలయన్స్ పిటిషన్ పై పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు, నోటీస్ ఆఫ్ మోషన్ జారీ

రైతు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న  ఆందోళన నేపథ్యంలో ముఖ్యంగా పంజాబ్ లో తమ  టవర్లను కొందరు రైతులు ధ్వంసం చేయడంపై రిలయన్స్ కోర్టుకెక్కింది..

రిలయన్స్ పిటిషన్ పై పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు, నోటీస్ ఆఫ్ మోషన్ జారీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 05, 2021 | 3:25 PM

Share

రైతు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న  ఆందోళన నేపథ్యంలో ముఖ్యంగా పంజాబ్ లో తమ  టవర్లను కొందరు రైతులు ధ్వంసం చేయడంపై రిలయన్స్ కోర్టుకెక్కింది. వీటి రక్షణకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్లు దాఖలు  చేసింది. దీనిపై కోర్టు మంగళవారం ఈ రాష్ట్రాలకు , కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.  జస్టిస్ సుధీర్ మిట్టల్ ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తూ .. నోటీస్ ఆఫ్ మోషన్ జారీ చేశారు. దీనికి ఫిబ్రవరి 8 కల్లా ఈ రాష్ట్రాలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తమ రిలయన్స్ జియో టవర్లకురైతులు నష్టం కలిగించడంవల్ల  ముఖ్యంగా సంస్థ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని రిలయన్స్ యాజమాన్యం తమ పిటిషన్లలో పేర్కొంది. పంజాబ్ లో సుమారు 1500 అన్నదాతలు నాశనం చేసి, కేబుల్  వైర్లను కట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దుశ్చర్యల వెనుక సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, వారు అసలు రైతులు కారని, ఈ దేశానికి ఆహారం అందిస్తున్న అన్నదాతలంటే తమకు ఎంత్జో గౌరవం ఉందని  రిలయెన్స్ యాజమాన్యం తెలిపింది. పైగా కార్పొరేట్ వ్యవసాయం పట్ల తమకు ఆసక్తి లేదని కూడా స్పష్టం చేసింది.