దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

ఇప్పుడు ఫోన్ నిత్యావసరంగా మారిపోయింది. ఫోన్ లేకపోతే ఒక్క పని కూడా కావడం లేదు. ప్రస్తుత అంతా సోషల్ మీడియా జనరేషన్ నడుస్తూ ఉండటంతో, ఫోన్ వాడకం గణనీయంగా పెరిగింది.

Ram Naramaneni

|

Nov 08, 2020 | 2:39 PM

ఇప్పుడు ఫోన్ నిత్యావసరంగా మారిపోయింది. ఫోన్ లేకపోతే ఒక్క పని కూడా కావడం లేదు. ప్రస్తుత అంతా సోషల్ మీడియా జనరేషన్ నడుస్తూ ఉండటంతో, ఫోన్ వాడకం గణనీయంగా పెరిగింది. కళ్లు తెరిచిన దగ్గర నుంచి మూసే వరకు ఫోన్ మన లైఫ్‌లో భాగం అయ్యింది. అయితే చాలామంది పడుకునేముందు ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి పక్కనే పెట్టుకుంటారు. మరికొంతమంది దిండు కింద పెట్టుకుని నిద్రిస్తారు. ఇలా చేసేవారు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. తాజాగా దిండు కింద పెట్టిన ఓ ఫోన్ పేలిన ఘటన కేరళలో జరిగింది.  కొల్లాం జిల్లాలో ఓ వ్యక్తి తన నోకియా ఫీచర్‌ ఫోన్‌ను నైట్ పడుకునే ముందు దిండు కింద పెట్టి నిద్రించాడు. రాత్రి సమయంలో ఒక్కసారిగా ఫోన్‌ పేలడంతో అతడి భుజం, ఎడమ మోచేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. పడుకునేముందు చొక్కా ధరించకపోవడంతో గాయాల తీవ్రత పెరిగింది. .

బాధితుడు వివరాల ప్రకారం.. ‘నేను త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్  నుంచి ప్రయాణికుడిని తన గమ్యస్థానం వద్ద వదిలిపెట్టి ఇంటికి వచ్చా. అప్పటికే బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రపోయా. అయితే ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో మేల్కొన్నా. భుజం వద్ద నొప్పిగా అనిపించింది. దిండు కాలిపోతూ ఉండగా ఫోన్‌ నుంచి మంటలు వస్తున్నాయి. వెంటనే ఫోన్‌ను దూరంగా నెట్టేసి హాస్పిటల్‌కు వెళ్లాను’ అని తెలిపాడు. దిండు కింద పెట్టినప్పుడు ఛార్జింగ్‌ పెట్టలేదని, అయినప్పటికీ బ్యాటరీ ఉబ్బిపోయి పేలుడు సంభవించిదని బాధితుడు పేర్కొన్నాడు. పేలడానికి గల రీజన్ ఏంటో తనకు తెలియదని, నోకియా కంపెనీ సమస్యను గుర్తించి పరిష్కరించాలని బాధితుడు కోరాడు.

Also Read : వాడికి ఉరేస్తేనే మాకు ఆత్మసంతృప్తి.. దివ్య పేరెంట్స్ సంచలన కామెంట్స్

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu