ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరంకు స్వల్ప ఊరట!

ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీల్యాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వయసు రీత్యా తీహార్‌ జైలుకు పంపవద్దన్న ఆయన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. అదే సమయంలో ఆయన కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడగించింది. చిదంబరం తరపున వాదనలు వినిపించిన కపిల్‌ సిబాల్‌ ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బెయిల్‌ మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో గృహ నిర్భంధానికైనా ఆదేశించాలన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం […]

ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరంకు స్వల్ప ఊరట!
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 7:03 PM

ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీల్యాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వయసు రీత్యా తీహార్‌ జైలుకు పంపవద్దన్న ఆయన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. అదే సమయంలో ఆయన కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడగించింది. చిదంబరం తరపున వాదనలు వినిపించిన కపిల్‌ సిబాల్‌ ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బెయిల్‌ మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో గృహ నిర్భంధానికైనా ఆదేశించాలన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ విషయాన్ని ట్రయల్‌ కోర్టులో ప్రస్తావించాలని సూచించింది. సిబల్‌ విజ్ఞప్తిని అంగీకరించిన కోర్టు చిదంబరాన్ని జైలుకు పంపొద్దని, బెయిల్‌ తిరస్కరించిన నేపథ్యంలో మరో మూడు రోజులు కస్టడీని కొనసాగించాలని ఆదేశించింది.

ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడుల తరలింపుకు సహకరించారనే ఆరోపణలతో చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంను ఆశ్రయించారు.సుప్రీం కూడా మధ్యంతర ఉత్తర్వులకు నో చెప్పడంతో ఆయన సీబీఐ కస్టడీలోనే కొనసాగుతున్నారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఐఎన్‌ఎక్స్‌ మీడియా స్థాపకులు పీటర్‌ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీలు తన కూతురు షీనా బోరా హత్యకేసులో నిందితులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.