మోదీకి మరో అరుదైన గౌరవం…

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చాక స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా బహిరంగ పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించారు. దీంతో కేంద్రం ప్రభుత్వ సాయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయంలో ప్రధాని మోదీ చొరవ తీసుకోవడంపై దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమానికి అమెరికాలో విశిష్ట గుర్తింపు దక్కింది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు గానూ ప్రధాన […]

మోదీకి మరో అరుదైన గౌరవం...
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 7:37 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చాక స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా బహిరంగ పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించారు. దీంతో కేంద్రం ప్రభుత్వ సాయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయంలో ప్రధాని మోదీ చొరవ తీసుకోవడంపై దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమానికి అమెరికాలో విశిష్ట గుర్తింపు దక్కింది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు గానూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఓ అవార్డు ప్రదానం చేయనుంది. ఈ నెల చివర్లో అమెరికా పర్యటనకు వెళ్లనున్న ప్రధానికి దీన్ని ప్రదానం చేయనున్నారు. దీనిపై పీఎంవో సహాయమంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ…. ప్రధాన నరేంద్ర మోదీ తీసుకుంటున్న వినూత్న నిర్ణయాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయన్నారు. ‘‘మరో అవార్డు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన మరో అపురూప ఘట్టం. ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. స్వచ్ఛభారత్ అభియాన్ చేపట్టినందకు గానూ నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటన సందర్భంగా బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి అవార్డు అందుకోనున్నారు..’’ అని జితేంద్ర ట్వీట్ చేశారు.