హిందు దేవాలయాల అభివృద్ధికి నిధులడిగే హక్కు అక్బరుద్దీన్ ఓవైసీకి లేదని బీజేపీ నేత రాజాసింగ్ పేర్కొన్నారు. హిందూ వ్యతిరేక మచ్చ తొలగించుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో హిందువులు, గోవులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాకనే.. దేవాలయాల అభివృద్ధి గురించి అక్బర్ మాట్లాడాలన్నారు. పాతబస్తీలోని కాళిమాత ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసని రాజాసింగ్ పేర్కొన్నారు.
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరడం ద్వారా.. తనపై ఉన్న హిందు వ్యతిరేక మచ్చను తొలగించుకోవటానికి అక్బర్ ప్రయత్నిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలో భాగంగానే ప్రగతిభవన్‌కు అక్బర్ వెళ్లారని ఆరోపించారు. కేసీఆర్ ఎంఐఎంకు కాకుండా.. రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించాలన్నారు. నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవటానికి సీఎం సమయం ఇవ్వటం లేదని విమర్శించారు. ఎంఐఎం నాయకులకు మాత్రం అడగకుండానే సమయం ఇస్తున్నారన్నారు.
[svt-event date=”11/02/2020,4:15AM” class=”svt-cd-green” ]
जो कभी “लाल दरवाजे” को हरा कर देंगे कहता था वो आज लाल दरवाजे में स्तिथ माँ महाकाली के मंदिर के विकास की बात कर रहा है।
“ये डर हमे अच्छा लगा” pic.twitter.com/2r7YAKUKz6
— Raja Singh (@TigerRajaSingh) February 10, 2020