ఫేక్ న్యూస్ పెడితే మీ ఫేస్‌బుక్ ఖాతా క్లోజ్..!

ఎన్నికల వేళ చాలా ఫేక్ న్యూస్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక అలాంటి ఫేక్ న్యూస్‌లను ఫేస్‌బుక్‌ చెక్ పెట్టనుంది. ఫేక్ వార్తలు పోస్ట్ చేసే ఖాతాలను ఇకపై ఫేస్‌బుక్ మూసివేయనుంది. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, తెలుగు, తమిళం, మరాఠీ, మలయాళం భాషల్లో ప్రస్తుతం ఫేస్‌బుక్ నిఘా పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 40 బృందాల్లో పని చేస్తున్న 30 వేల మంది నిరంతరం వీటిని పర్యవేక్షిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న సిబ్బంది, టెక్నాలజీ […]

ఫేక్ న్యూస్ పెడితే మీ ఫేస్‌బుక్ ఖాతా క్లోజ్..!

Edited By:

Updated on: Apr 09, 2019 | 7:40 PM

ఎన్నికల వేళ చాలా ఫేక్ న్యూస్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక అలాంటి ఫేక్ న్యూస్‌లను ఫేస్‌బుక్‌ చెక్ పెట్టనుంది. ఫేక్ వార్తలు పోస్ట్ చేసే ఖాతాలను ఇకపై ఫేస్‌బుక్ మూసివేయనుంది. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, తెలుగు, తమిళం, మరాఠీ, మలయాళం భాషల్లో ప్రస్తుతం ఫేస్‌బుక్ నిఘా పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 40 బృందాల్లో పని చేస్తున్న 30 వేల మంది నిరంతరం వీటిని పర్యవేక్షిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న సిబ్బంది, టెక్నాలజీ సాయంతో రోజుకు 10 లక్షల ఫేక్ పోస్టులను తొలిగించగలరని సమాచారం.