
Nivetha Thomas In Prabhas Movie: ‘జెంటిల్ మెన్’, ‘118’, ‘నిన్ను కోరి’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ నివేదా థామస్. తాజాగా ఆమెకు వరుసపెట్టి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారీ వారి పాట’లో సెకండ్ హీరోయిన్‌గా నటించనున్న నివేదా.. ప్రభాస్ మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇటీవలే విడుదలైంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించనుంది. ఇక ఈ చిత్రంలో కథకు కీలకమైన మరో హీరోయిన్‌కు ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దానికోసం నివేదా థామస్‌ను ఎంపిక చేయనున్నట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ నడుస్తోంది. కాగా, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
Also Read:
‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!
అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ధోని..
వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..
భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..