నిర్భయ దోషులకు ఉరి.. స్పందించిన ‘దిశ’ తండ్రి..!

పలు ఉత్కంఠల మధ్య నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. తీహార్ జైలులో ఈ రోజు ఉదయం నలుగురు దోషులు ఉరికొయ్యలకు వేలాడారు.

  • Tv9 Telugu
  • Publish Date - 8:54 am, Fri, 20 March 20
నిర్భయ దోషులకు ఉరి.. స్పందించిన 'దిశ' తండ్రి..!

పలు ఉత్కంఠల మధ్య నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. తీహార్ జైలులో ఈ రోజు ఉదయం నలుగురు దోషులు ఉరికొయ్యలకు వేలాడారు. దీనిపై యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్భయ దోషులకు ఉరి వేయడంపై దిశ తండ్రి స్పందించారు. నిర్బయ కేసు దోషులకు ఉరిశిక్షను విధించినందుకు సంతోషమని ఆయన అన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని.. దిశ కేసులో చాలా త్వరగా న్యాయం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఆడపిల్లపై అఘాయిత్యాలకు పాల్పడితే వెంటనే చంపేయాలని ఆయన సూచించారు. ఈ కేసులో నిర్భయ తల్లి సుదీర్ఘంగా పోరాడారని ఆయన కితాబిచ్చారు. కాగా గతేడాది తెలంగాణలో దిశ హత్యాచారానికి గురైంది. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ఆ కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమైన విషయం తెలిసిందే.

Read This Story Also: నిమ్మగడ్డకు ఊరట.. సెర్బియా నుంచి విడుదల