బెజ‌వాడ‌ గ్యాంగ్ వార్ : మరో తొమ్మిది మంది అరెస్ట్..

ఏపీలో రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన గ్యాంగ్ వార్ కేసును పోలీసులు సీరియ‌స్ గా తీసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్ప‌టికే పండు గ్యాంగ్ నుంచి 11 మంది, సందీప్ గ్యాంగ్ నుంచి 13 మందిని అదుపులోకి తీసుకోగా.. తాజాగా మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.

బెజ‌వాడ‌ గ్యాంగ్ వార్ : మరో తొమ్మిది మంది అరెస్ట్..

Updated on: Jun 10, 2020 | 10:19 PM

ఏపీలో రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన గ్యాంగ్ వార్ కేసును పోలీసులు సీరియ‌స్ గా తీసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్ప‌టికే పండు గ్యాంగ్ నుంచి 11 మంది, సందీప్ గ్యాంగ్ నుంచి 13 మందిని అదుపులోకి తీసుకోగా.. తాజాగా మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం 33 మంది పోలీసుల అదుపులో ఉన్నారు.

మణికంఠం అలియాస్ పండు వర్గానికి చెందిన పటాన్ మహబూబ్ బాషా, షేక్ హుస్సేన్, యలగంటి ఈశ్వరరావు, అబ్దుల్ బాజీ, నల్లూరి నవీన్ బాబు, … తోట సందీప్ వర్గానికి చెందిన నగవరపు వెంకటేశ్వరరావు, గుండు దుర్గానాగప్రసాద్, బత్తినేని వెంకట ఆనందకృష్ణ, కట్టా నాగరాజులు అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. నిందితుల నుంచి స్నేప్ బ్లేడులు, సైడర్ బ్లేడులు, రెండు మోటారు వెహిక‌ల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. కాగా ఈ గొడ‌వ‌లో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న‌ పండు ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌గానే పోలీసులు అతన్ని అరెస్ట్ చేయనున్నారు. ఆపై కోర్టులో హాజరుపర్చి క‌స్టడీ అడిగే అవ‌కాశం ఉంది. కాగా ఈ గొడ‌వ‌లో తీవ్ర గాయాల‌పాలై తోట సందీప్ అనే వ్య‌క్తి మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.