NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడుల కలకలం.. ఇంతకీ దాడులకు దారి తీసిన కేసు పూర్వపరాలేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విరసం, ప్రజా సంఘాల నేతల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లో పౌర హక్కుల సంఘం తెలంగాణ ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్, ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో విప్లవ..

NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడుల కలకలం.. ఇంతకీ దాడులకు దారి తీసిన కేసు పూర్వపరాలేంటో తెలుసా?
Nia
Follow us

|

Updated on: Apr 01, 2021 | 6:57 PM

NIA Raids in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల బుధ, గురువారాల్లో నిర్వహించిన ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దాడులపై రాజకీయ కలకలం చెలరేగింది. న్యాయం కోసం, పౌర హక్కుల కోసం పోరాడుతున్న తమని టార్గెట్ చేస్తున్నారంటూ పలువురు వ్యక్తులు, సంస్థలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) లక్ష్యంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో విరసం, ప్రజా సంఘాల నేతల ఇళ్లలో ఎన్ఐఏ (NIA) సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ (Hyderabad)‌లో పౌర హక్కుల సంఘం తెలంగాణ ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్, ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మి, గుంటూరు (Guntur) జిల్లా సత్తెనపల్లిలో పౌర హక్కుల సంఘం ఏపీ ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్, డప్పు రమేశ్, మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లోని ప్రజా కళా మండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్, విశాఖపట్నం (Vishakhapatnam)లోని పిఠాపురం కాలనీలో న్యాయవాది కె.పద్మ, చినవాల్తేరులో న్యాయవాది కె. ఎస్.చలం ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. న్యాయవాది పద్మ ఇంటి నుంచి హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఎన్ఐఏ (National Investigating Agency) సిబ్బంది. శ్రీకాకుళం జిల్లా పల్లి సారథి, రాజాంలలోనూ ఎన్ఐఏ సోదాలు జరిగాయి. సహా పలువురు ఇతర నాయకుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు.

ఇదీ నేపథ్యం…

మహారాష్ట్ర (Pune)లోని పుణె (Pune) సమీపంలో బీమా కోరేగాం (Bheema Koregoan) హింసలో మావోయిస్టుల (Maoists) ప్రమేయం ఉందని గతంలో ఆరోపణలున్నాయి. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నిన విషయం వెలుగు చూసింది. అక్కడ అరెస్టయిన వారిలో కొందరికి ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్న మాట. ఈ కేసులో విరసం నేత వరవరరావు (Varavara Rao) సహా అరెస్టయిన తొమ్మిది మంది ఉద్యమకారులు ఏడాది కాలంగా జైళ్లలోనే మగ్గారు. వారికి బెయిలు (Bail) మంజూరు చేసేందుకు కోర్టులు పలుమార్లు నిరాకరించాయి. కొన్ని పిటిషన్లపై విచారణలు, తీర్పులు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. కేసు విచారణ కూడా వాయిదాలతోనే సాగుతోంది.

2018 జనవరి 1న మహారాష్ట్రలోని పుణె సమీపంలో గల భీమా-కోరెగావ్‌ ఘటన జరిగింది. ‘పీష్వాలపై దళితుల విజయం’ ద్విశతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో ఓ వ్యక్తి చనిపోగా.. పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు. హింసను ప్రేరేపించారన్న ఆరోపణలపై హిందూ (Hindu) సంస్థల ప్రతినిధులు శంభాజీ భిడే, మిలింద్ ఏక్బోటేలపై కేసు నమోదైంది. వీరిలో మిలింద్ ఏక్బోటేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌ మీద విడుదలయ్యారు. శంభాజీ భిడే ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు.

2018 జూన్ మొదటి వారం హింసను ప్రేరేపించారన్న ఆరోపణలపై రిపబ్లికన్ పాంథర్స్ జాతి అంతాచీ చల్వల్ (ఆర్‌పీ) నేత సుధీర్ ధవలే, నాగ్‌పూర్‌కి చెందిన హక్కుల న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ఢిల్లీకి చెందిన కార్యకర్త రోనా విల్సన్‌, నాగ‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సోమా సేన్, పీఎంఆర్‌డీ మాజీ పరిశోధకుడు మహేశ్ రావుత్‌ దేశంలోని పలు చోట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు ముంబయిలోను మరికొందరు నాగ్‌పూర్, ఢిల్లీలలో పుణె పోలీసులకు చిక్కారు. వీరందరు మావోయిస్టులను పోలీసులు అభియోగాలు మోపారు. వీరందరి నివాసాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. కొన్ని ఎలక్ట్రానిక్ స్టోరేజీ పరికరాలు, సీడీలు, మరి కొన్ని ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజీవ్‌గాంధీ హత్య తరహాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని హత్య చేయటానికి మావోయిస్టులు కుట్ర పన్నిన విషయం తమ దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు. ఈ సాక్ష్యాల ఆధారంగానే ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు వారు వెల్లడించారు. 2018 ఆగస్టు 28వ తేదీన విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుతోపాటు పలువురు మానవ హక్కుల సంఘం నాయకులు, న్యాయవాదులు, రచయితల ఇళ్ళలో మహారాష్ట్ర పోలీసుల సోదాలు నిర్వహించారు.

ఆ తర్వాత వరవరరావును హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి పుణె తీసుకెళ్లారు పోలీసులు. అదే రోజు దేశంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి.. న్యాయవాది, హక్కుల కార్యకర్త సుధా భరద్వాజ్, ప్రజాస్వామ్య, మానవ, పౌర హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్‌లాఖా, సుధీర్ ధావలె విడుదల కోసం పనిచేస్తున్న న్యాయవాది, హక్కుల కార్యకర్త అరుణ్ ఫెరీరా, రచయిత, ఉద్యమకారుడు వెర్నన్ గొంజాల్వెజ్‌‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018 నవంబర్‌లో ప్రాథమిక చార్జిషీట్ నమోదు చేసారు. భీమా కోరేగావ్ అల్లర్లకు సంబంధించి జూన్‌లో అరెస్టు చేసిన వారిలో కొందరు మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారనే వాదన వుంది.

వీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారని.. వారికి వరవరరావు ఆర్థికంగా సహకరిస్తున్నారని మహారాష్ట్ర పోలీసుల ప్రధాన అభియోగం. 2017 డిసెంబరు 31 పుణెలో మావోయిస్టుల సహకారంతో ఎల్గర్ పరిషత్‌లో సమ్మేళనం నిర్వహించారని, అందులో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని వీరిపై పోలీసులు అభియోగాలు మోపారు. రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగానే మరుసటి రోజు భీమా కోరెగావ్ మెమెరియల్ వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు అంటున్నారు. ఎల్గర్ పరిషత్ సమ్మేళనంలో ప్రధాని మోదీ హత్యకు కుట్ర జరిగిందని, ప్రభుత్వాని కూలగొట్టడం, కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేయడం వంటి అంశాలపై అక్కడ చర్చ జరిగినట్లు పుణె పోలీసులు పేర్కొన్నారు.

ఈ కేసు విచారణలో బయటకు వచ్చిన విప్లవ రచయిత సంఘం నేత వరవరరావు పేరు బయటికి రావడంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. వరవరరావుపై ఐపీసీ 153 (ఏ), 505 (1) (బీ), 117, 120 (బీ), చట్ట వ్యతిరేక చర్యల (నియంత్రణ) చట్టం సెక్షన్ 13, 16, 17, 18 (బీ), 20, 38, 39, 40 సెక్షన్ల కింద మహారాష్ట్ర పుణె జిల్లా విశారంబాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముంబయిలోని తలోజా జైల్లో వరవరరావును విచారణ ఖైదీగా వుంచారు. ఆ తర్వాత హైదరాబాద్‌తో సహా ముంబయి, పుణె, గోవా, రాంచీ, ఢిల్లీ నగరాల్లోని మానవహక్కుల నేతల ఇళ్లల్లో మహారాష్ట్ర పోలీసులు సోదాలు నిర్వహించారు.

2019 డిసెంబర్‌ 26న వరవరరావు ఇంటి నుంచి హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు మహారాష్ట్ర పోలీసులు. 2020 జులై 28న కోరేగావ్-ఎల్గార్ పరిషత్ కేసులో ప్రొఫెసర్ హనీ బాబును ముంబయిలో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. 2020 జులై 16న రిమాండ్ ఖైదీగా జైలులో వున్న వరవరరావుకు కరోనా సోకింది. అప్పట్నించి వరవరరావు నిరంతరం అనారోగ్యానికి గురవుతూనే వున్నారు. దాంతో ఆయన్ని ముంబయిలోని జేజే ఆసుపత్రిలో చేర్చారు. ఈ కేసులన్నీ పోలీసుల కల్పితాలేనని, భీమా-కోరేగావ్ హింసకు కారకులైన శంభాజీ భీడే, మిలింద్ ఏక్బోటేల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నంలో భాగంగా మహారాష్ట్ర పోలీసులు ఇలా చేశారని విరసం నేత వరవరరావు గతంలో ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు.

వీరి అరెస్టులపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా.. విచారించిన ధర్మాసనం ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిశీలించి వారందరికీ గృహ నిర్బంధంలో వుంచాలని ఆదేశాలు జారీ చేసింది. వీరిలో గౌతమ్ నవలాఖాకు గృహ నిర్బంధం నుంచి కూడా విముక్తి కల్పించింది కోర్టు. 2018 నవంబర్ నెలలో మిగతా నలుగురిని పోలీసులు మళ్లీ అరెస్టు చేసి జైలుకు తరలించారు. వారికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని, అందుకు ప్రాథమిక ఆధారాలున్నందునే అరెస్టు చేశామని పుణె పోలీసులు కోర్టుకు నివేదించారు. 2019 ఫిబ్రవరిలో మరిన్ని ఆధారాలతో అభియోగాలు మోపుతూ మరోసారి అనుబంధ చార్జీషీట్ దాఖలు చేశారు పోలీసులు. అదే నెలలో ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబేని పుణె పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఆయన అరెస్టు అక్రమమని పుణె కోర్టు విడుదలకు ఆదేశించింది.

ఆ తర్వాత రెండు నెలలకు అంటే 2019 ఏప్రిల్ నెలలో వరవరరావు విడుదలను కోరుతూ ఆయన భార్య హేమలత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. కేసు విచారణ కొనసాగిస్తూనే తన భర్తకు బెయిల్ ఇవ్వాలని ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. సురేంద్ర గాడ్లింగ్, సోమాసేన్, సుధీర్ ధావాలే, మహేశ్ రౌత్, రోనా విల్సన్‌లు 2018 జూన్ నెలలో అరెస్టు కాగా.. అదే సంవత్సరం ఆగస్టులో వరవరరావు, సుధా భరద్వాజ్, సుధీర్ ధావాలె, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొంజాల్వెజ్‌ అరెస్టయ్యారు. మొదటి చార్జిషీట్ దాఖలు చేసి దాదాపు పది నెలలవుతున్నా విచారణలో పురోగతి లేకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

సాక్ష్యాల సేకరణలో తీవ్రంగా శ్రమిస్తున్న ఎన్ఐఏ 2020 నవంబర్ నెలలో విశాఖ జిల్లా ముంచంగి పుట్టులో మావోయిస్టు కొరియర్ పంగి నాగన్నను పోలీసులు అరెస్టు చేశారు. నాగన్న ఇచ్చిన సమాచారంతో మొత్తం 64 మంది అనుమానితుల జాబితాను రూపొందించారు. 2021 మార్చి 7వ తేదీన ఈ కేసును ఏపీ పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. అయితే ఈ సోదాలను కూడా పోలీసులు అక్రమంగా నిర్వహిస్తున్నారంటూ పౌర హక్కుల సంఘం నేతలు గగ్గొలు పెట్టారు. పౌర హక్కుల సంఘం తెలంగాణ విభాగం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు, ప్రొఫెసర్‌ హరగోపాల్ తదితరులు ఏపీ పోలీసులు, ఎన్ఐఏ తీరును తీవ్రంగా ఎండగట్టారు. తాజాగా ఎన్ఐఏ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన సోదాల్లో కీలక ఆధారాలు లభ్యమయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇంకెందరిని ఎన్ఐఏ అరెస్టు చేస్తుందో అన్న అంశంపై ఉత్కంఠ పెరిగిపోతోంది.

ALSO READ: సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం.. దాదాసాహెబ్ ఫాల్కే.. అవార్డు పుట్టుపూర్వోత్తరాలివే!

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.