కరోనాపై విజయం.. యాక్టివ్ కేసులు లేని దేశంగా..

| Edited By:

Jun 08, 2020 | 11:04 AM

ఆ దేశం కరోనా నుంచి పూర్తిగా ఫ్రీ అయిపోయింది. కోవిద్-19 మ‌హ‌మ్మారిపై న్యూజిలాండ్ అమోఘ విజ‌యం సాధించి, చరిత్ర సృష్టించింది. దేశ సరిహద్దుల‌ను మూసివేసిన మూడు నెలల తరువాత క‌రోనాను త‌రిమికొట్టిన‌ట్లు

కరోనాపై విజయం.. యాక్టివ్ కేసులు లేని దేశంగా..
Follow us on

ఆ దేశం కరోనా నుంచి పూర్తిగా ఫ్రీ అయిపోయింది. కోవిద్-19 మ‌హ‌మ్మారిపై న్యూజిలాండ్ అమోఘ విజ‌యం సాధించి, చరిత్ర సృష్టించింది. దేశ సరిహద్దుల‌ను మూసివేసిన మూడు నెలల తరువాత క‌రోనాను త‌రిమికొట్టిన‌ట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. ప్ర‌స్తుతం న్యూజిలాండ్‌లో ఒక్క కరోనా కేసు కూడా లేదు. దీంతో న్యూజిలాండ్ ప్ర‌జ‌లు సోషల్ మీడియాలో వేడుకలు చేసుకోవ‌డం ప్రారంభించారు. క‌రోనా వ్యాధి బారిన ప‌డిన చివరి కరోనా రోగి కోలుకున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది.

కాగా.. న్యూజిలాండ్‌లో ఫిబ్రవరి 28న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఆ తర్వాత మే 22 వరకూ… 1504 కేసులు నమోదయ్యాయి. మే 22 తర్వాత ఇక కొత్త కేసులు రాలేదు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చెందిన క‌రోనా బాధిత మ‌హిళ వ్యాధి నుంచి కోలుకుని, సెయింట్ మార్గరెట్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేప‌ధ్యంలో న్యూజిలాండ్ ప్రధాని జసిందా అర్డెర్న్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సంద‌ర్భంగా దేశంలో విధించిన‌ ఆంక్షల సడలింపును ప్రధాని ప్రకటించవచ్చ‌ని తెలుస్తోంది.