జీడిమెట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్ఎంటీ కంపెనీ సమీపంలో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకురు మృతి చెందగా.. మరో యువకుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

  • Sanjay Kasula
  • Publish Date - 10:44 am, Mon, 8 June 20
జీడిమెట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్ఎంటీ కంపెనీ సమీపంలో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో యువకుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. చింతల్ నుండి షాపూర్‌ వైపు వస్తుండగా… ప్రమాదవశాత్తు బైక్‌ స్కిడ్ అయ్యి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోపన్‌రామ్‌, సందీప్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిద్దర్నీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సోపన్‌రామ్‌ మృతి చెందాడు. సందీప్‌కుమార్‌ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన సోపన్‌ రామ్‌, బీహార్‌కు చెందిన సందీప్‌కుమార్‌ ఉపాధి నిమిత్తం వలస వచ్చి జీడిమెట్ల ఇండస్ట్రియల్‌ కార్యాలయంలో ఉన్న క్యాంటిన్‌లో పనిచేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్‌ అయ్యాయి.