కుప్పకూలిన శిక్షణ విమానం..ఇద్దరు మృతి
శిక్షణ విమానం కూలిపోవటంతో ట్రెయినర్‌తో సహా ఇద్దరు మరణించారు. బిరసాల్ ఎయిర్‌పోర్టులో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే శిక్షణ విమానం కుప్పకూలింది. దీంతో శిక్షణ పొందుతున్న మహిళా పైలట్..

ఒడిశాలోని భువనేశ్వర్ జిల్లాలో విమానప్రమాదం సంభవించింది. శిక్షణ విమానం కూలిపోవటంతో ట్రెయినర్‌తో సహా ఇద్దరు మరణించారు. డెంకనాల్ జిల్లాలోని బిరసాల్ ఎయిర్‌పోర్టులో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే శిక్షణ విమానం కుప్పకూలింది. దీంతో శిక్షణ పొందుతున్న మహిళా పైలట్ అనీస్ ఫాతిమా, శిక్షకుడు కెప్టెన్ సంజీబ్ కుమార్ ఝా అక్కడికక్కడే మృతిచెందారు. అనీస్ ఫాతిమా తమిళనాడుకు చెందినవారు కాగా, సంజీబ్ కుమార్ బీహార్‌కు చెందినవారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టారు.




