AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవదంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన పెద్దలు!

కులాంతర వివాహం చేసుకున్నందుకు కక్షగట్టిన పెద్దలు.. నవ దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో యువతి చనిపోగా.. భర్త మృత్యువుతో పోరాడుతున్నాడు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా బయటపడింది. నిగోజ్‌ గ్రామానికి చెందిన మంగేష్ రాణ్ సింగ్, రుక్మిణిలు ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో పెద్దల్ని ఎదిరించిన ఈ ప్రేమ జంట ఆరు నెలల క్రితం […]

నవదంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన పెద్దలు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 06, 2019 | 7:53 PM

Share

కులాంతర వివాహం చేసుకున్నందుకు కక్షగట్టిన పెద్దలు.. నవ దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో యువతి చనిపోగా.. భర్త మృత్యువుతో పోరాడుతున్నాడు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా బయటపడింది.

నిగోజ్‌ గ్రామానికి చెందిన మంగేష్ రాణ్ సింగ్, రుక్మిణిలు ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో పెద్దల్ని ఎదిరించిన ఈ ప్రేమ జంట ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. భార్యాభర్తలు చిన్న విషయంలో గొడవపడటంతో.. భర్తపై అలిగిన రుక్మిణి గత నెల 30న పుట్టింటికి వెళ్లింది.

రుక్మిణిని తిరిగి ఇంటికి తీసుకొద్దామని ఈ నెల 1న అత్తారింటికి వెళ్లాడు మంగేష్. కులాంతర వివాహం చేసుకున్నారన్న కోపంతో ఉన్న రుక్మిణ కుటుంబ సభ్యులు మంగేష్‌ను చితకబాదారు. తర్వాత దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలిపోతూ భార్యాభర్తలు పెద్దగా కేకలు వేయడంతో.. స్థానికులు వచ్చి మంటలార్పారు. ఇద్దర్ని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.

రుక్మిణి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి చనిపోయింది… మంగేష్ శరీరం 50 శాతం కాలిపోగా… పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై రుక్మిణి తండ్రి రమా భర్టియాతో పాటూ మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. రుక్మిణి తండ్రి పరారీలో ఉండగా.. మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు