విజయ్‌ సేతుపతిపై నెటిజన్లు గరం గరం

ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 800 సినిమా లో ప్రధాన పాత్రను పోషిస్తున్న విజయ్‌ సేతుపతిపై నెటిజన్‌లు విరుచుకుపడుతున్నారు. విజయ్‌ సేతుపతికి తమిళంలోనే కాదు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్‌ ఉంది..

విజయ్‌ సేతుపతిపై నెటిజన్లు గరం గరం
Follow us
Balu

|

Updated on: Oct 14, 2020 | 2:12 PM

ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 800 సినిమా లో ప్రధాన పాత్రను పోషిస్తున్న విజయ్‌ సేతుపతిపై నెటిజన్‌లు విరుచుకుపడుతున్నారు. విజయ్‌ సేతుపతికి తమిళంలోనే కాదు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్‌ ఉంది.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తోనే ప్రశంసలు అందుకున్న నటుడు విజయ్‌ సేతుపతి.. ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్రలోకి దూరిపోతాడాయన! ఇప్పుడు మురళీధరన్‌లో పాత్రలో కూడా పరకాయ ప్రవేశం చేసినట్టు అనిపించింది.. ఆయన లుక్‌ అద్భుతం.. అంతా బాగానే ఉంది కానీ మురళీధరన్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి నటించడమే నెటిజన్‌లకు నచ్చలేదు.. ఆ కోపంతోనే షేమ్‌ఆన్‌ విజయ్‌సేతుపతి అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌ఓ ట్రెండింగ్‌ మొదలు పెట్టారు..ఇందుకు కారణం.. శ్రీలంక ప్రభుత్వం మొదటి నుంచి తమ దేశంలోని తమిళులను అణచివేయడమే! వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా చూడటమే.. అలాంటి దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెట్‌ పాత్రలో విజయ్‌సేతుపతి నటించడమేమిటి? ఇదేనా తమిళ ప్రేక్షకుల పట్ల మీరు చూపే కృతజ్ఞత అంటూ నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు.. విజయ్‌ సేతుపతి మీరు చేస్తున్నది తప్పు అంటూ ట్రోల్‌ చేస్తున్నారు కొందరు.. సినిమా రూపకర్తలు మాత్రం ఈ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.. తాము తీసే బయోపిక్‌ ఆద్యంతమూ ఆసక్తికరంగా .. అద్భతుంగా ఉంటుందని చెబుతున్నారు.. బయోపిక్‌లో ఎక్కడా అసత్యాలు ఉండవని, అభూత కల్పనలు అసలే ఉండవని చెప్పుకొచ్చారు. మురళీధరన్‌ జీవితంలో జరిగిన ఘటనలను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తామని అంటున్నారు. ముత్తయ్య మురళీధరన్‌ జీవితంలోని మనకు తెలియని అనేక కోణాలను తెరమీదకు తెస్తామని చెబుతున్నారు.