వెబ్‌సైట్ ద్వారా ఆనంద‌య్య మందు పంపిణీ.. వేగంగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం యంత్రాంగం

|

Jun 03, 2021 | 8:01 AM

ananthaiah Mandu : నంద‌య్య మందు పంపిణీ ఎప్ప‌టి నుంచి అని అంతా ఎదురుచూస్తోన్న స‌మ‌యంలో.. సోమవారం నుండి అందుబాటులోకి తెస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.. అయితే, ఆ మందు కోసం వెబ్‌సైట్‌లో రిజిస్ట్ర‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది.  దీని కోసం...

వెబ్‌సైట్ ద్వారా ఆనంద‌య్య మందు పంపిణీ.. వేగంగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం యంత్రాంగం
Arrangements For The Preparation Of Anandayya Mandu
Follow us on

ఆనందయ్య మందు కోసం ఎదురుచూస్తున్నవారికి మరో శుభవార్త అందించారు. పంపిణీని మరింత ఈజీ చేసేలా ప్లాన్ చేశారు. ఆనందయ్య మందు తయారీ, పంపిణీకి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.. ఇప్పటికే ఆ ఏర్పాట్లలో నిమగ్నమైన ఆయన.. ప్రస్తుతం మందు తయారీలో బిజీగా ఉన్నారు. కోరుకున్న అందరికీ మందు అందుబాటులో ఉండేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏపీ సర్కార్‌ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో మ‌ళ్లీ మందు పంపిణీకి సిద్ధమవుతున్నారు.  నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య‌.. అయితే, మందు కోసం ఇత‌ర ప్రాంతాల నుంచి ఎవ‌రూ కృష్ణ‌ప‌ట్నానికి రావొద్దు అని ఇప్ప‌టికే విజ్ఞ‌ప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి జిల్లాకు 5 వేల చొప్పున మందులు పంపుతామ‌ని.. అధికారులు వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ని ప్రకటించారు.

మ‌రి ఆనంద‌య్య మందు పంపిణీ ఎప్ప‌టి నుంచి అని అంతా ఎదురుచూస్తోన్న స‌మ‌యంలో.. సోమవారం నుండి అందుబాటులోకి తెస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.. అయితే, ఆ మందు కోసం వెబ్‌సైట్‌లో రిజిస్ట్ర‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది.  దీని కోసం.. www.childeal.in పేరుతో వెబ్‌సైట్ రూపొందించారు.. ఆ వెబ్‌సైట్ పేరును నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం ప్ర‌క‌టించింది.

ఇక‌, ఈ వెబ్‌సైట్ నిర్వ‌హ‌ణ‌లో ఆనంద‌య్య అనుచ‌రులు పూర్తిగా నిమ‌గ్న‌మ‌య్యారు. సైట్‌లో వినియోగదారులు ముందుగా దరఖాస్తులు నమోదు చేసుకోవల్చేసి ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసుకున్నవారికి  కొరియర్ ద్వారా మందును వారి చిరునామాకు నేరుగా పంపిణీ చేసేందుకు ఆనందయ్య టెక్నికల్ టీమ్ సిద్ధంగా ఉంది.అయితే మందు తయారీ సమయంలో భద్రత , పంపిణీకి సహకరించాలని ఆనంద‌య్య‌ కలెక్టర్‌ని అభ్యర్థించారు. సోమ‌వారం నుంచి మందు పంపిణీ ప్రారంభం కానుకండ‌గా.. మ‌రి ఆన్‌లైన్‌లో ఆనంద‌య్య మందుకు ఎంత‌టి డిమాండ్ ఉంటుందో చూడాలి.

ఇదిలావుంటే… నెల్లూరుజిల్లా కృష్ణపట్నంలో కరోనా నివారణ ఔషద తయారీకి బుధవారం  ఏర్పాట్లను మొదలు పెట్టారు. జిల్లా అధికారుల సూచనల మేరకు కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో ఔషదం తయారీకి ఏర్పాట్లు చేసుకున్నారు ఆనందయ్య. బుధవారం అకాడమీ ప్రాంగణంలో మందు తయారీ కోసం ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్ ను నిర్మించనున్నారు. ఈ షెడ్ నిర్మాణం కోసం ఆనందయ్య భూమి పూజ చేశారు. భగవాన్ వెంకయ్య స్వామి శిష్యుడు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల్లో షెడ్ నిర్మాణం.. ఇతర సదుపాయాల కల్పన పూర్తవుతుంది. తర్వాత అక్కడే మందు తయారీని మొదలు పెట్టి… సోమవారం నుండి పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ‘పీఎం సార్.. ఫేర్‌వెల్ పార్టీకి అవకాశం ఇవ్వండి.. ఆమెను చీరలో చూడాలి’ స్టూడెంట్ వైరల్ ట్వీట్..!