‘పీఎం సార్.. ఫేర్‌వెల్ పార్టీకి అవకాశం ఇవ్వండి.. ఆమెను చీరలో చూడాలి’ స్టూడెంట్ వైరల్ ట్వీట్..!

కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ పరీక్షలు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర...

'పీఎం సార్.. ఫేర్‌వెల్ పార్టీకి అవకాశం ఇవ్వండి.. ఆమెను చీరలో చూడాలి' స్టూడెంట్ వైరల్ ట్వీట్..!
Follow us

|

Updated on: Jun 02, 2021 | 7:12 PM

కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ పరీక్షలు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన హై-లెవెల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయానికి విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్ధి విచిత్రమైన కోరికను కోరాడు. అతడు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

12వ తరగతి ముగించుకుని స్కూల్ నుంచి బయటకు వెళ్లే తమకు ఫేర్‌వెల్ పార్టీ లేదని తలచి.. తలంపు వచ్చినదే తడవుగా కుకీ అగర్వాల్ అనే విద్యార్ధి ప్రధానికి ట్వీట్ పెట్టాడు. ‘సార్.. ఫేర్‌వెల్ అయినా చేసుకోనివ్వండి. ఆ 12వ తరగతి బి-సెక్షన్ నేహాను చీరలో చూడాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్, మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు.