Nayeem family: ఐటీ అధికారులకు నయీం ఫ్యామిలీ షాక్

కొన్నేళ్ళ క్రితం దారుణంగా ఎన్‌కౌంటరైన గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబీకులు అదాయపన్ను శాఖ అధికారులను ముప్పతిప్పలు పెడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ బడితే అక్కడ...

Nayeem family: ఐటీ అధికారులకు నయీం ఫ్యామిలీ షాక్

Updated on: Feb 26, 2020 | 12:56 PM

Gangster Nayeem family troubles Income Tax officials: కొన్నేళ్ళ క్రితం దారుణంగా ఎన్‌కౌంటరైన గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబీకులు అదాయపన్ను శాఖ అధికారులను ముప్పతిప్పలు పెడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ బడితే అక్కడ ఆస్తులు, లెక్కలేనంత ధనం కలిగి వున్నారన్న ఆరోపణలతో నయీం కుటుంబీకులకు నోటీసులిచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఐటీ అధికారులకు దొరక్కుండా తప్పించుకుంటూ వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అందుకున్న నోటీసులను చిత్తుకాగితాలుగా పరిగణిస్తూ అధికారుల సహనాన్ని పరీక్షిస్తున్నారు.

నయీం.. ఒకప్పుడు ఈ పేరు వింటేనే హైదరాబాద్ శివార్లతోపాటు.. నల్గొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పట్టేవి. గ్యాంగ్‌స్టర్‌ నయీం చేసే సెటిల్మెంట్ల జోలికి వెళ్ళేందుకు మామూలు పోలీసులు కూడా జంకేవారు. అయితే రోజులన్నీ ఒకేలా వుండవన్నట్లు.. ఓ ఫైన్ డే పోలీసులది పైచేయి అయ్యింది. నయీం క్రైమ్ కహానీకి ద ఎండ్ కార్డు పడింది. ఎన్‌కౌంటర్‌లో దారుణమైన చావు చచ్చిన నయీం కథ అంతటితో ముగిసిందనే చాలా మంది అనుకున్నారు.

కానీ, నయీం క్రైమ్ కహానీలోని ఒక్కో బిట్టు వెలుగులోకి వస్తుంటే.. అతను కబ్జా చేసిన ఆస్తులు, బెదిరించి రాయించుకున్న భూములు, వసూలు చేసిన కోట్లాది రూపాయలు.. ఇలా ఒక్కో క్రైమ్ బిట్… వింటున్న ప్రేక్షకులు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. నయీం భార్య, తల్లి, సోదరిలకు అక్రమ సంపాదనకు ఆధారాలు చూపాలంటూ నోటీసులిచ్చేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే 9 సార్లు నయీం కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు ఇచ్చారు.

అయితే, ఐటీ అధికారులు ఇచ్చిన ఏ నోటీసుకు నయీం కుటుంబ సభ్యులు స్పందించడం లేదు సరికదా అస్సలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సుమారు 1000 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి నయీం కుటుంబ సభ్యుల నుండి ఐటీ శాఖ వివరణ కోరింది. తాజాగా నయీం అనుచరుడు పాశం శ్రీనుకు నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ ఆయన్ను విచారణకు రమ్మని ఆదేశించింది. మరోవైపు నయీం ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలను సిట్ అధికారుల నుండి ఐటీ అధికారులు సేకరించారు.

Read this: Kishan Reddy challenges Political parties రాజకీయ పార్టీలకు కిషన్‌రెడ్డి సవాల్