AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harvey Weinstein Guilty: ఈ మాజీ ప్రొడ్యూసర్ దోషి.. న్యూయార్క్ జ్యూరీ తీర్పు

హాలీవుడ్ లో ఒకప్పటి పవర్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకరైన 67 ఏళ్ళ హార్వే వీన్ స్టీన్...  లైంగిక దాడుల కేసుల్లో దోషేనని న్యూయార్క్ కోర్టు ప్రకటించింది. రాజకీయంగానో, ఇతరత్రానో డబ్బు, పలుకుబడి గల బడా వ్యక్తులు ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే.. బాధిత మహిళలు ధైర్యంగా ప్రజల్లోకి వఛ్చి

Harvey Weinstein Guilty: ఈ మాజీ ప్రొడ్యూసర్ దోషి.. న్యూయార్క్ జ్యూరీ తీర్పు
Umakanth Rao
|

Updated on: Feb 25, 2020 | 6:37 PM

Share

హాలీవుడ్ లో ఒకప్పటి పవర్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకరైన 67 ఏళ్ళ హార్వే వీన్ స్టీన్…  లైంగిక దాడుల కేసుల్లో దోషేనని న్యూయార్క్ కోర్టు ప్రకటించింది. రాజకీయంగానో, ఇతరత్రానో డబ్బు, పలుకుబడి గల బడా వ్యక్తులు ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే.. బాధిత మహిళలు ధైర్యంగా ప్రజల్లోకి వఛ్చి వారిమీద  ఆరోపణలు చేయడానికి స్ఫూర్తి నిచ్చిన ‘మీటూ’ ఉద్యమానికి ఇది ఒకవిధంగా విజయమేనంటున్నారు.  2006 లో మాజీ ప్రొడక్షన్ అసిస్టెంట్ మిమీ హాలీపై లైంగిక దాడికి, 2013 లో జెస్సికా మాన్ అనే నటిపై అత్యాచారానికి పాల్పడినట్టు హార్వే పై ఆరోపణలు వచ్చాయి. ఆయనకు కోర్టు 29 ఏళ్ళ జైలుశిక్ష విధించవచ్ఛు. తనను కోర్టు విచారిస్తున్న సందర్భంగా హార్వే.. బాగా అలసిపోయినట్టు కనిపించాడు.   వాకర్ స్టిక్ తో కోర్టు హాల్లోకి ప్రవేశించాడు.  సపోర్ట్ కోసం తరచూ తన న్యాయవాదిభుజాలపై తలవాలుస్తూ వచ్చాడు. ‘అయితే ఇతగాడు మంచి యాక్టింగ్ టిప్స్ నేర్చుకున్నట్టు ఉంది’ అని రోజ్ మేక్ గోవన్ అనే నటి వ్యాఖ్యానించింది. కోర్టు బయట ఈమె మరికొందరు బాధిత మహిళలతో కలిసి నిరసనకు దిగింది.

కొన్నేళ్ల క్రితమే హార్వే తమపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని కొందరు బాధిత మహిళలు ఆరోపిస్తే.. మరికొంతమంది తమను ఇతడు రేప్ చేశాడని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారమని, తాను అమాయకుడినని, ఏదైనా జరిగి ఉంటే అది పరస్పర అంగీకారంతోనే జరిగిందని హార్వే అడ్డంగా వాదించాడు.  వయస్సు రీత్యా ఇతనికి యావజ్జీవ శిక్ష పడవచ్ఛు.. లేదా రెండు అంశాల్లో నిర్దోషిగా విముక్తుడు కావచ్చునని కూడా అంటున్నారు. హాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ హార్వే అనేకమంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవాడట. విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్లు ఇతడిని ‘సీరియల్ రేపిస్ట్’ అని దుయ్యబట్టారు. సుమారు 80 మంది మహిళల్లో చాలామంది ఇతనిపై సివిల్ దావాలు దాఖలు చేశారు.

ఛాతీ నొప్పి అంటూ..

తాజా సమాచారం ప్రకారం.. తనకు ఛాతీ నొప్పి వచ్చిందంటూ హార్వే వీన్ స్టీన్.. మెలికలు తిరిగిపోవడంతో అతడ్ని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. న్యూయార్క్ కోర్టు ఇతడ్ని దోషిగా పేర్కొన్న నేపథ్యంలో అధికారులు రికర్స్ దీవిలోని జైలుకు తరలిస్తుండగా.. ఇలా కొత్త ఎత్తు వేశాడు. అయితే ఇతని గుండెకు వఛ్చిన ప్రమాదమేమీ లేదని, కేవలం హై బీపీ ఉందని డాక్టర్లు వెల్లడించారు. మార్చి 11 న హార్వేకి కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ఏడుగురు పురుషులు, అయిదుగురు మహిళలతో కూడిన న్యూయార్క్ జ్యురీ  ఇతడిని దోషిగా ప్రకటించడం విశేషం.