India Corona Cases : దేశంలో కొత్తగా 24,010 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టీవ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి

|

Dec 17, 2020 | 11:28 AM

తాజాగా నమోదైన గణాంకాలు గమనిస్తే దేశంలో కరోనా తీవ్రత తగ్గినట్లే అనిపిస్తుంది. బుధవారం 11,58,960 కరోనా టెస్టులు చేయగా.. 24,010 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

India Corona Cases : దేశంలో కొత్తగా 24,010 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టీవ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి
Follow us on

తాజాగా నమోదైన గణాంకాలు గమనిస్తే దేశంలో కరోనా తీవ్రత తగ్గినట్లే అనిపిస్తుంది. బుధవారం 11,58,960 కరోనా టెస్టులు చేయగా.. 24,010 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 99,56,558కి చేరింది. కొత్తగా మరో 355 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,44,451కు చేరింది. వరసగా గత ఐదురోజులుగా కరోనా మరణాలు 400 దిగువనే నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,22,366 యాక్టీవ్ కేసులున్నాయి. దేశంలో యాక్టీవ్ కేసుల రేటు 3.24  ఉండగా..రికవరీ రేటు 95 శాతం పైనే కొనసాగుతోంది. బుధవారం వ్యాధి బారి నుంచి 33,291 మంది కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 94,89,740కు చేరింది.

కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం వద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. ప్రస్తుతం చలి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి అనుకూలత ఎక్కువగా ఉంటుందని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Also Read : 

హెచ్‌సీఏకు మరో ఎదురుదెబ్బ, కొత్త సీజన్‌‌లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి..కారణాలు ఇవే

Gold Rate Today : రెండో రోజూ స్వల్పంగా పెరిగిన పసిడి ధర, వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి

అనంతపురం నగరంలో కలకలం..పురాతన చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం ధ్వంసం చేసేందుకు దుండగుల యత్నం