దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి: ప్రధాని మోడీ

| Edited By:

Jun 15, 2019 | 4:57 PM

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఎన్నికల తంతు ముగిసిందని ప్రధాని మోడీ అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు దేశాభివృద్ధి గురించే పనిచేయాలని చెప్పారు. పేదరికం, నిరుద్యోగం, కరువు, వరదలు, కాలుష్యం, అవినీతి, హంస పై కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మహాత్మాగాంధీ 150వ వార్షికోత్సవం కోసం నిర్దేశించిన లక్ష్యాలను అక్టోబర్ 2వ తేదీలోగా నెరవేర్చాలని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కళా కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, […]

దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి: ప్రధాని మోడీ
Follow us on

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఎన్నికల తంతు ముగిసిందని ప్రధాని మోడీ అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు దేశాభివృద్ధి గురించే పనిచేయాలని చెప్పారు. పేదరికం, నిరుద్యోగం, కరువు, వరదలు, కాలుష్యం, అవినీతి, హంస పై కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మహాత్మాగాంధీ 150వ వార్షికోత్సవం కోసం నిర్దేశించిన లక్ష్యాలను అక్టోబర్ 2వ తేదీలోగా నెరవేర్చాలని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కళా కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, రక్షణ, హోం, ఆర్థికశాఖ మంత్రులు, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల మంత్రులు హాజరయ్యారు.