అమ్మానాన్నల పెళ్లిరోజు.. ఆదర్శ దంపతులు అంటూ లోకేష్ ట్వీట్..

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నారాలోకేష్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ రోజు అమ్మానాన్నల పెళ్లిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ.. ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు అంటూ నారాలోకేష్ ట్వీట్ చేశారు. ఆ ఆదర్శ దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్ళు వర్థిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లిదండ్రులు […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:59 am, Tue, 10 September 19
అమ్మానాన్నల పెళ్లిరోజు.. ఆదర్శ దంపతులు అంటూ లోకేష్ ట్వీట్..

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నారాలోకేష్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ రోజు అమ్మానాన్నల పెళ్లిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ.. ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు అంటూ నారాలోకేష్ ట్వీట్ చేశారు. ఆ ఆదర్శ దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్ళు వర్థిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.