AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jan Nicol Loftie: ఇదేం బాదుడు భయ్యా! 33 బంతుల్లోనే సెంచరీ.. 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఊచకోత.. వీడియో చూశారా?

నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లోఫ్టీ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే మెరుపు సెంచరీ చేసి అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఆతిథ్య నేపాల్‌తో కీర్తిపూర్‌ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ రికార్డును అందుకున్నాడు.

Jan Nicol Loftie: ఇదేం బాదుడు భయ్యా! 33 బంతుల్లోనే సెంచరీ.. 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఊచకోత.. వీడియో చూశారా?
Jan Nicol Loftie Eaton
Basha Shek
|

Updated on: Feb 27, 2024 | 5:55 PM

Share

నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లోఫ్టీ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే మెరుపు సెంచరీ చేసి అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఆతిథ్య నేపాల్‌తో కీర్తిపూర్‌ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ రికార్డును అందుకున్నాడు. అంతకుముందు ఈ ప్రపంచ రికార్డు నేపాల్ జట్టుకు చెందిన కుషాల మల్లా పేరిట ఉంది. ఆసియా క్రీడల మ్యాచ్‌లో మంగోలియాపై కుశాల్ కేవలం 34 బంతుల్లోనే సెంచరీ చేశాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో జాన్ నికోల్ లాఫ్టీ నేపాల్ ఆటగాడి పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం విశేషం. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయడం ద్వారా టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయర్ గా జాన్ నిలిచాడు. 11వ ఓవర్ లో క్రీజులోకి వచ్చిన నికోల్ లాఫ్టీ శివాలెత్తాడు. . మైదానం అంతా సిక్స్‌లు, ఫోర్ల వర్షం కురిపించాడు. నేపాల్ బౌలర్లను చీల్చి చెండాడుతూ కేవలం 33 బంతుల్లోనే అద్భుత సెంచరీ సాధించి సరికొత్త చరిత్రను లిఖించాడు.

ఓవరాల్ గా 36 బంతులు ఎదుర్కొన్న నికోల్ లాఫ్టీ 8 భారీ సిక్సర్లు, 11 ఫోర్లతో 101 పరుగులు చేసి అవుటయ్యాడు. జాన్ మెరుపు సెంచరీ కారణంగా నమీబియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. 207 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించిన నేపాల్ జట్టు 18.5 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి టీ20లో నమీబియా 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

జాన్ మెరుపు సెంచరీ.. వీడియో ఇదుగో..

ఐసీసీ ట్వీట్ ..

గతంలో టీ20 ల్లో మెరుపు సెంచరీలు సాధించిన ప్లేయర్లు వీరే..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే