కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన నాగశౌర్య.. హీరోయిన్‌గా టాప్ సింగర్..
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుసపెట్టి సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు.
Heroine Shirley Setia: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుసపెట్టి సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ‘అలా ఎలా’ ఫేమ్ దర్శకుడు అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
సింగింగ్ సెన్సేషన్, ప్రముఖ యూట్యూబర్ షెర్లీ సెటియా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ స్వయంగా ధృవీకరించింది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కాలేదు. నాగశౌర్య తల్లిదండ్రులు ఉషా, శంకర్ ములుపూరి ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Introducing the sensational @ShirleySetia to TFI. @ira_creations being known for launching exceptional talents has found a perfect fit for their upcoming flick #ProdNo4 #NS22 #IRA4@IamNagashaurya ? #AneeshKrishna A @mahathi_sagar ? ?️ #SaiSriram ? #UshaMulpuri @YEMYENES pic.twitter.com/WpTuXmTV0z
— BARaju (@baraju_SuperHit) November 21, 2020