AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వాల్వ్’‌ లేని ‘ఎన్‌-95’ మాస్క్‌లే ఉత్తమమైనవి

కరోనా నేపథ్యంలో మాస్క్‌ ధరించడం అందరి జీవితంలో భాగమైపోయింది. అయితే ఈ వైరస్ వ్యాప్తి నిరోధించాలంటే ఎలాంటి మాస్క్‌లు ధరించాలన్న అంశంపై

'వాల్వ్'‌  లేని 'ఎన్‌-95' మాస్క్‌లే ఉత్తమమైనవి
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 14, 2020 | 6:51 AM

Share

Best Masks to stop Coronavirus spread: కరోనా నేపథ్యంలో మాస్క్‌ ధరించడం అందరి జీవితంలో భాగమైపోయింది. అయితే ఈ వైరస్ వ్యాప్తి నిరోధించాలంటే ఎలాంటి మాస్క్‌లు ధరించాలన్న అంశంపై అమెరికా డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ‘లేజర్‌ సెన్సర్‌ డివైజ్‌’తో 14 రకాల మాస్క్‌లు, ఫేస్‌ కవరింగ్స్‌ను వారి పోల్చి చూశారు. ఈ మాస్క్‌లు ధరించి మాట్లాడినప్పుడు వారి నుంచి తుంపర్లు ఏ దిశలో ప్రయాణించాయి? వాటిని అడ్డుకోవడంలో మాస్క్‌లు ఏ మేరకు సమర్థంగా పనిచేశాయన్న దానిని వారు అధ్యయనం చేశారు. వీటిని లేజర్‌ బీమ్, లెన్స్, మొబైల్‌ ఫోన్‌ కెమెరాతో పరిశీలించారు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి కారక తుంపర్లను నిరోధించడానికి వాల్వ్‌లు లేని ఎన్‌–95 మాస్క్‌లే అత్యుత్తమమైనవని వారు తేల్చారు.

వీటి తరువాత త్రీ లేయర్‌ మాస్క్‌లు మంచివని వారు వెల్లడించారు. ఆ తరువాత కాటన్‌–పాలిప్రోలిన్‌–కాటన్‌ మాస్క్‌లు‌ మూడోస్థానంలో, టూ లేయర్‌ పాలిప్రోపిలిన్‌ ఏప్రాన్‌ మాస్క్‌లు‌ నాలుగో స్థానంలో నిలిచాయి. ఇక వదులైన బట్టతో చేసినవి, ఫేస్‌ కవరింగ్స్‌ వంటివి మాస్క్‌లు ధరించకుండా ఉన్న దాంతోనే సమానమని తెలిసింది. వాల్వ్‌లున్న ఎన్‌-95 మాస్క్‌లు సమర్ధంగా తుంపర్ల వ్యాప్తిని అడ్డుకోలేకపోతున్నాయని వారి అధ్యయనంలో తేలింది. మాట్లాడేటప్పుడు, గాలిని బయటకు వదిలినప్పుడు ఎన్‌–95 మాస్క్‌కున్న వాల్వ్‌లు తెరుచుకోవడం వల్ల పరిసరాల్లోని వ్యక్తులకు తుంపర్ల నుంచి రక్షణ తగ్గుతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే వీటిపై మరింతగా పరిశోధించాల్సిన అవసరముందని డ్యూక్‌ వర్సిటీ పరిశోధకుడు ఎమ్మా ఫిషర్‌ తెలిపారు.

Read More:

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ‘జగనన్న విద్యా కానుక’ ఇచ్చేది అప్పుడే..

కరోనాపై షాకింగ్ న్యూస్.. 16 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి.!

Follow Us
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..
ఎల్‌పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం..!
ఎల్‌పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం..!
పెళ్లి తర్వాత జాక్‌పాట్ కొట్టే 6 రాశులు.. జీవిత భాగస్వామే వీరి..
పెళ్లి తర్వాత జాక్‌పాట్ కొట్టే 6 రాశులు.. జీవిత భాగస్వామే వీరి..
ఇకపై మందుల లేబుల్‌పై క్యూఆర్ కోడ్‌ తప్పనిసరి..!
ఇకపై మందుల లేబుల్‌పై క్యూఆర్ కోడ్‌ తప్పనిసరి..!