Murder in Sangareddy: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. భూ వివాదంలో కత్తులతో దాడి.. ఒకరు మృతి

|

Jan 05, 2021 | 10:03 PM

Murder in Sangareddy: భూ వివాదాల వల్ల ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. సామరస్యంగా పరిష్కరించుకోవలసిని సమస్యను పెద్దదిగా చేసుకొని ఒకరిపై

Murder  in Sangareddy: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. భూ వివాదంలో కత్తులతో దాడి.. ఒకరు మృతి
Follow us on

Murder in Sangareddy: భూ వివాదాల వల్ల ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. సామరస్యంగా పరిష్కరించుకోవలసిని సమస్యను పెద్దదిగా చేసుకొని ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్నారు. ఫలితంగా కుటుంబ సభ్యులకు అన్యాయం చేసి కానరాని లోకాలకు వెళుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇరువురి కుటుంబాల మధ్య ఉన్న వివాదాల వల్ల ఒకరు బలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ గ్రామంలో భూమి గురించి దేవయ్య, ప్రదీప్ కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొంది. వీరి మధ్య గత కొన్నేళ్లుగా భూమి గురించిన గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయంలో దేవయ్య, అతడి కొడుకుపై ప్రత్యర్థులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దేవయ్య కొడుకు కరుణాకర్ మృతి చెందగా, దేవయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Awareness on Mental Health: ఈ మాజీ జవాన్ సంకల్పానికి చేతులెత్తి మొక్కాలి.. మానసిక ఆరోగ్యం గురించి ఏం చేస్తున్నాడో తెలుసా..

ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆత్మహత్య.. అతడి రూమ్‌లోనే తాడుతో ఉరేసుకొని..