ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆత్మహత్య.. అతడి రూమ్‌లోనే తాడుతో ఉరేసుకొని..

దేశంలో ప్రేమికుల ఆత్మహత్యలు సర్వసాధారణం అయ్యాయి. కొంతమంది తల్లిదండ్రులు తమ ప్రేమను ఒప్పుకోకపోవడంతో చనిపోతున్నారు. మరికొంతమంది ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి సూసైడ్ చేసుకుంటున్నారు.

  • uppula Raju
  • Publish Date - 12:14 pm, Sat, 28 November 20
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆత్మహత్య.. అతడి రూమ్‌లోనే తాడుతో ఉరేసుకొని..

దేశంలో ప్రేమికుల ఆత్మహత్యలు సర్వసాధారణం అయ్యాయి. కొంతమంది తల్లిదండ్రులు తమ ప్రేమను ఒప్పుకోకపోవడంతో చనిపోతున్నారు. మరికొంతమంది ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి సూసైడ్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా చావే పరిష్కారంగా ఎంచుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఉరేసుకొని చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పాండురంగ నగర్‌కు చెందిన ప్రవీణ, వికారాబాద్‌కు చెందిన శ్రీకాంత్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీకాంత్ హైదర్‌గూడలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. అయితే ప్రవీణ తరచూ శ్రీకాంత్ రూంకు వచ్చి వెళుతూ ఉంటుంది. ఇద్దరు కలిసి కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల కొన్ని విషయాలలో మనస్పర్థలు రావడం మొదలైంది. ప్రవీణ పెళ్లి చేసుకోవాలని శ్రీకాంత్‌ను కోరడంతో అతడు ససేమిరా అన్నాడు. ఈ విషయమై ఇద్దరు కొద్దిసేపు వాదులాడుకున్నఅనంతరం శ్రీకాంత్ రూమ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రవీణ అతడి రూంలోనే తాడుతో ఉరేసుకొని మృతిచెందింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.