సీపీ సజ్జనార్‌పై హత్య కేసు.. ఫిర్యాదు చేసిన స్వచ్ఛంద సంస్థ!
డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. నిందితులను కోర్టులు, కేసులు అంటూ తిప్పడమేంటని.. తక్షణమే ఉరి తీయాలంటూ యువత రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలిపారు. అటు పోలీసులు కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టి మృగాళ్లకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని చెప్పారు. అయితే ఈ నెల 6వ తేదీన సీన్ రీ- కన్‌స్ట్రక్షన్ చేస్తున్న తరుణంలో ఆ నలుగురు నిందితులు తప్పించుకునేందుకు యత్నించారు. పోలీసులపై రాళ్లు రువ్వి.. […]
డాక్టర్ దిశ అత్యాచారం, హత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. నిందితులను కోర్టులు, కేసులు అంటూ తిప్పడమేంటని.. తక్షణమే ఉరి తీయాలంటూ యువత రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలిపారు. అటు పోలీసులు కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టి మృగాళ్లకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని చెప్పారు. అయితే ఈ నెల 6వ తేదీన సీన్ రీ- కన్‌స్ట్రక్షన్ చేస్తున్న తరుణంలో ఆ నలుగురు నిందితులు తప్పించుకునేందుకు యత్నించారు. పోలీసులపై రాళ్లు రువ్వి.. ఆయుధాలను లాక్కుని ఫైరింగ్ చేశారు. ఇక పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎదురుకాల్పులు జరపడంతో వారు మృతి చెందారు.
ఈ ఎన్‌కౌంటర్‌కు దేశవ్యాప్తంగా చాలామంది హర్షధ్వానాలు వ్యక్తం చేయగా.. కొంతమంది మాత్రం వ్యతిరేకించారు. ఇక తాజాగా హైదరాబాద్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నేను సైతం’ అనే స్వచ్ఛంద సంస్థ అధినేత డి. ప్రవీణ్ కుమార్.. నిందితులను పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారని ఫిర్యాదులో పేర్కొంటూ.. సీపీ సజ్జనార్‌తో పాటు నలుగురు పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు. అయితే ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదుపై రాచకొండ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలుస్తోంది.