ముంబై ట్రాఫిక్‌లో ఇరుక్కున్నామా..? అంతే సంగతులు..!
ప్రపంచవ్యాప్తంగా ఇరుకైన ట్రాఫిక్ నగరాల్లో భారత వాణిజ్య రాజధాని ముంబై టాప్‌లో నిలిచింది. ట్రాఫిక్ ఇండెక్స్ ఆధారంగా ఓ సంస్థ సర్వేలో వరుసగా రెండోసారి ముంబై మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ ట్రాఫిక్‌లో ఒక్కసారి చిక్కుకున్నామంటే.. నిర్ణీత సమయంలో మన గమ్యస్థానానికి చేరుకోలేమని ఆ సర్వే తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు ఖండాల్లోని 403 నగరాల్లో ఈ సర్వే చేయగా.. అందులో కొలంబియా రాజధాని బగోటా, పెరులోని లిమా, భారత్‌లోని న్యూఢిల్లీ, రష్యా రాజధాని మాస్కో తరువాతి స్థానాల్లో […]

ప్రపంచవ్యాప్తంగా ఇరుకైన ట్రాఫిక్ నగరాల్లో భారత వాణిజ్య రాజధాని ముంబై టాప్‌లో నిలిచింది. ట్రాఫిక్ ఇండెక్స్ ఆధారంగా ఓ సంస్థ సర్వేలో వరుసగా రెండోసారి ముంబై మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ ట్రాఫిక్‌లో ఒక్కసారి చిక్కుకున్నామంటే.. నిర్ణీత సమయంలో మన గమ్యస్థానానికి చేరుకోలేమని ఆ సర్వే తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు ఖండాల్లోని 403 నగరాల్లో ఈ సర్వే చేయగా.. అందులో కొలంబియా రాజధాని బగోటా, పెరులోని లిమా, భారత్‌లోని న్యూఢిల్లీ, రష్యా రాజధాని మాస్కో తరువాతి స్థానాల్లో నిలిచాయి. జనాభా పెరగడం, ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాలు తక్కువగా ఉండటంతోనే నగరాల్లో ట్రాఫిక్ పెరుగుతోందని ఆ సర్వే వెల్లడించింది.
దీనిపై ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. ‘‘దీన్ని బట్టే చూస్తుంటే ఒక మంచి, ఒక చెడు కనిపిస్తుంది. ట్రాఫిక్ పెరుగుతుందంటే ఎకనమీ పరంగా ఆ నగరం అభివృద్ధి చెందుతున్నట్లే. కానీ ఈ ట్రాఫిక్ వలన ప్రయాణికుల సమయం చాలా వృధా అవుతుంది. ఇక దీని వలన పర్యావరణానికి జరిగే చేటు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు’’ అంటూ చెప్పుకొచ్చారు.