కారెక్కనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే..!

టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీని విలీనం చేసుకునే వ్యూహానికి అధికార టీఆర్ఎస్ పదునుపెడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో దెబ్బ తగిలింది. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి కారెక్కనున్నారు. కాసేపట్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో రోహిత్‌ రెడ్డి భేటీ కానున్నారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరుతారని చాలా రోజుల క్రితమే వార్తలు వచ్చాయి అయితే.. ఆయన తన నిర్ణయాన్ని ఆలస్యంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. చివరకు టీఆర్ఎస్‌లో చేరాలనే నిశ్చయించుకున్నారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ తరపున […]

కారెక్కనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 06, 2019 | 12:06 PM

టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీని విలీనం చేసుకునే వ్యూహానికి అధికార టీఆర్ఎస్ పదునుపెడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో దెబ్బ తగిలింది. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి కారెక్కనున్నారు. కాసేపట్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో రోహిత్‌ రెడ్డి భేటీ కానున్నారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరుతారని చాలా రోజుల క్రితమే వార్తలు వచ్చాయి అయితే.. ఆయన తన నిర్ణయాన్ని ఆలస్యంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. చివరకు టీఆర్ఎస్‌లో చేరాలనే నిశ్చయించుకున్నారు.

కాగా.. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన 19 మంది ఎమ్మెల్లో ఆల్రెడీ 11 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని ప్రకటించగా.. తాజాగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. దాంతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 7కు పడిపోయింది. ఈ నేపథ్యంలో 18 మందిలో మూడొంతుల మంది అంటే 12 మంది టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనమయ్యేందుకు అంగీకరిస్తూ స్పీకర్‌కు వినతిపత్రం అందిస్తే చాలు. ఆ తర్వాత తంతు స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.