గిటారిస్ట్ మ్యూజిక్ కి రామచిలుకలు ఫిదా

సంగీతానికి పశు పక్ష్యాదులు కూడా స్పందిస్తాయంటే ఇదేనేమో ! ముంబైలో ఓ యువ గిటారిస్ట్  మ్యూజిక్ కి రెండు రామచిలుకలు ఫిదా అయిపోయాయి. జతిన్ తలుక్ దర్ అనే ఈ గిటార్ వాద్య కారుడు..

గిటారిస్ట్ మ్యూజిక్ కి రామచిలుకలు ఫిదా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 09, 2020 | 1:30 PM

సంగీతానికి పశు పక్ష్యాదులు కూడా స్పందిస్తాయంటే ఇదేనేమో ! ముంబైలో ఓ యువ గిటారిస్ట్  మ్యూజిక్ కి రెండు రామచిలుకలు ఫిదా అయిపోయాయి. జతిన్ తలుక్ దర్ అనే ఈ గిటార్ వాద్య కారుడు తన ఇంటి కిటికీ వద్ద కూర్చుని గిటార్ వాయిస్తుండగా.. ఎక్కడినుంచో వఛ్చిన రెండు రామచిలుకలు అక్కడ వాలాయి. అందమైన, చూడచక్కనైన వీటిని చూసి జతిన్… మరింత ఉత్సాహంతో.. అలాగే తన వాద్యాన్ని వాయిస్తూ.. వాటి ఉనికిని ఎంజాయ్ చేస్తూ వచ్చాడు.  ఈ రెండు రామచిలుకల్లో ఒకటి అతని వాద్యానికి మరీ ఐసయిపోయి.. ఆ సంగీతానికి అనుగుణంగానా అన్నట్టు ముందుకు వస్తూ.. ‘చిలుక కూతలు కూసింది’. వీటికి ఆ గిటారిస్ట్.. జిమ్, కైరీ అనే ముద్దు పేర్లు పెట్టేశాడు. తన ఫేస్ బుక్ లో వీటి గురించి వర్ణిస్తూ.. ఇవి తమ కుటుంబంలో భాగమై పోయాయని పేర్కొన్నాడు. పైగా.. ‘థాంక్స్ టు ది యూనివర్స్.. ఫర్ సెండింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఆఫ్ నేచర్’ అని ప్రకృతికి జతిన్ కృతజ్ఞతలు తెలిపాడు.

https://www.facebook.com/1185561299/videos/10223202220822264/

Latest Articles