భారీ వర్షాల కారణంగా.. ముంబై-గోవా హైవే మూసివేత..!

| Edited By:

Aug 06, 2020 | 11:41 AM

మహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబయి నగరం అతలాకుతలం అయింది. నగరంలోని పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాయగడ్ లోని గోడ్ నది పొంగి ప్రవహిస్తుండటంతో ముంబై-గోవా జాతీయ రహదారిని మూసివేశారు.

భారీ వర్షాల కారణంగా.. ముంబై-గోవా హైవే మూసివేత..!
Follow us on

మహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబయి నగరం అతలాకుతలం అయింది. నగరంలోని పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాయగడ్ లోని గోడ్ నది పొంగి ప్రవహిస్తుండటంతో ముంబై-గోవా జాతీయ రహదారిని మూసివేశారు. జాతీయ రహదారిలోని కల్మాజీ బ్రిడ్జి వద్ద గోడ్ నది పొంగి ప్రవహిస్తుండటంతో ముంబై -గోవా మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వాహనాలను భీరనాకా మీదుగా మళ్లిస్తున్నామని హైవే సేఫ్టీ పెట్రోల్ ఎస్పీ విజయ్ పాటిల్ చెప్పారు.

అతి భారీ వర్షాల కారణంగా.. ముంబై నుంచి వచ్చే వాహనాలను నిజాంపూర్ వద్ద మళ్లిస్తున్నామని ఎస్పీ చెప్పారు. భారీవర్షాల వల్ల సావిత్రి నదిలో వరదనీరు ప్రవహిస్తున్నందున ఎవరూ నదిలో ఈత కొట్టవద్దని కోరారు. మాంగావ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల బాలుడు నదిలో దిగి వరదనీటిలో మరణించాడు. దీంతో రాయగఢ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించామని జిల్లా కలెక్టరు నిధి చౌదరి చెప్పారు. మంగోన్ తాలూకాలోని సోనియాచి వాడి గ్రామం ముంపునకు గురవడంతో 86 మందిని పడవల సాయంతో సురక్షితప్రాంతాలకు తరలించామని రాయ్ గడ్ పోలీసులు చెప్పారు.

Read More:

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. 21 రోజుల్లో ఇంటి అనుమతులు..!

దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ!