ముఖేశ్‌ అంబానీ క్రేజీ రికార్డ్..ద‌న‌వంతుల లిస్టులో బఫెట్‌ను వెనక్కి నెట్టిశాడు..

భారత బ‌డా వ్యాపార దిగ్గజం ముఖేశ్‌ అంబానీ మ‌రో క్రేజీ రికార్డు సొంతం చేసుకున్నారు. సంపన్నుల లిస్టులో అప‌ర కుబేరుడు క‌మ్ దాన‌క‌ర్ణుడు వారెన్‌ బఫెట్‌ను వెనక్కి నెట్టారు.

ముఖేశ్‌ అంబానీ క్రేజీ రికార్డ్..ద‌న‌వంతుల లిస్టులో బఫెట్‌ను వెనక్కి నెట్టిశాడు..
Follow us

|

Updated on: Jul 10, 2020 | 11:06 PM

భారత బ‌డా వ్యాపార దిగ్గజం ముఖేశ్‌ అంబానీ మ‌రో క్రేజీ రికార్డు సొంతం చేసుకున్నారు. సంపన్నుల లిస్టులో అప‌ర కుబేరుడు క‌మ్ దాన‌క‌ర్ణుడు వారెన్‌ బఫెట్‌ను వెనక్కి నెట్టారు. బ్లూమ్‌బర్గ్‌ సంపన్నుల సూచీ ప్రకారం..అధిక ధ‌న‌వంతుల లిస్టులో ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు. ఆసియా ఖండం నుంచి టాప్‌-10లో ఉన్న ఒకే ఒక్క వ్య‌క్తి ముఖేశ్‌ కావడం విశేషం.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను అప్పులేని సంస్థ‌గా మార్చాలని న‌డుం బిగించిన‌ ముఖేశ్‌ అంబానీ.. ఆ పనిలో స‌క్సెస్ అయ్యారు. ప్రజంట్ రిల‌య‌న్స్ సంస్థ‌ విలువ 68.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. బఫెట్‌ సంస్థ బెర్క్‌షైర్‌ హాథ‌వే విలువ 67.9 బిలియన్‌ డాలర్లు. అయితే‌ 2.9 బిలియన్‌ డాలర్లను డొనేష‌న్ ఇవ్వడం, సంస్థ పనితీరు కాస్త మందగించడం వల్ల బఫెట్‌ తొమ్మిదో స్థానానికి ప‌డిపోయారు. 2006లోనూ 37 బిలియన్‌ డాలర్లను విరాళంగా ఇచ్చేయ‌డం వల్ల ఆయన ర్యాంకు త‌గ్గిపోయింది. కాగా ఈ ఏడాది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్‌ విభాగంలో సిల్వర్‌ లేక్, ఫేస్‌బుక్ తో పాటు మ‌రికొన్ని సంస్థ‌లు 15 బిలియన్‌ డాలర్లకు పైగా ఇన్వెస్టిమెంట్స్ పెట్టాయి.