AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీర్‌లో ఉగ్రదాడి.. 30కి పైగా జవాన్లు కన్నుమూత

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 30 మందికి పైగా సిఆర్‌పిఎఫ్ జవాన్లు కన్నుమూశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. జమ్ము-శ్రీనగర్ హైవేపై జవాన్లు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఉగ్ర దాడి జరిగింది. 78 వాహనాల్లో సుమారు 2500 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఈ కాన్వాయ్ అవంతిపుర ప్రాంతం సమీపంలోకి రాగానే దాడి జరిగింది. శ్రీనగర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. దాడితో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. వెంటనే రాష్ట్రంలో హై […]

కశ్మీర్‌లో ఉగ్రదాడి.. 30కి పైగా జవాన్లు కన్నుమూత
Vijay K
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 8:29 PM

Share

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 30 మందికి పైగా సిఆర్‌పిఎఫ్ జవాన్లు కన్నుమూశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. జమ్ము-శ్రీనగర్ హైవేపై జవాన్లు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఉగ్ర దాడి జరిగింది. 78 వాహనాల్లో సుమారు 2500 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఈ కాన్వాయ్ అవంతిపుర ప్రాంతం సమీపంలోకి రాగానే దాడి జరిగింది. శ్రీనగర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. దాడితో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. వెంటనే రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు.

దాడికి పాల్పడింది తామే అని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఉగ్రవాది అదిల్‌ అహ్మద్‌ 350 కేజీల పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కారుతో సీఆర్ఫీఎఫ్‌ కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టాడు. దీంతో భారీ విస్ఫోటనం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాడి చేసిన ఉగ్రవాది అదిల్ అహ్మద్ పుల్వామాలోని కకపోర ప్రాంతానికి చెందినవాడు. 2018లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. దాడికి గురైన బస్సులో 39 మంది ప్రయాణిస్తున్నారని, అందులో 76వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఈ దాడిని పలువురు నాయకులు ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇదొక తుచ్చమైన చర్య అని, మన సైనికుల ప్రాణ త్యాగం వృధా కాకూడదని అన్నారు. మరణించిన జవాన్ల కుటుంబాలకు అండగా దేశం మొత్తం ఉంటుందని, గాయాలపాలైన సైనికులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ దాడిలో సుమారు 20కిపైగా గాయాలపాలయ్యారు.

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!