ఏపీ ప్రజలకు ఈ బుధవారం సంబరాలు చేసుకోవాల్సిన రోజుగా మిగిలిపోయేలా వుంది. కారణం ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, హోంగార్డులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, జూనియర్ న్యాయవాదులకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు బంపర్ బొనాంజా ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్యక్షతన బుధవారం అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్న నిర్ణయాలు, వాటి తాలూకు వివరాలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. కూర్చొన్న చోటి వేలాది రూపాయలు చేరేలా అద్బుత పథకాల్ని గతంలో ప్రకటించిన జగన్… వాటి ఆచరణలోను దూకుడు ప్రదర్శిస్తున్నారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఏపీ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు :
ఏపీ కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు :