‘ఫొణి’ పోయి.. ‘వాయు’ వచ్చే

| Edited By:

Jun 11, 2019 | 12:32 PM

లక్షద్వీప్, తూర్పు మధ్య అరేబియా సముద్రాన్ని ఆనుకొని నైరుతి అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన వాయుగుండం తుపానుగా బలపడింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాను ప్రభావంతో కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, కొంకణ్, మహారాష్ట్ర, గోవా తదితర ప్రాంతాల్లో నేటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. ఇక ఈ తుపానుకు మనదేశం సూచించిన వాయు అనే పేరును పెట్టారు. […]

‘ఫొణి’ పోయి.. ‘వాయు’ వచ్చే
Follow us on

లక్షద్వీప్, తూర్పు మధ్య అరేబియా సముద్రాన్ని ఆనుకొని నైరుతి అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన వాయుగుండం తుపానుగా బలపడింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాను ప్రభావంతో కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, కొంకణ్, మహారాష్ట్ర, గోవా తదితర ప్రాంతాల్లో నేటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. ఇక ఈ తుపానుకు మనదేశం సూచించిన వాయు అనే పేరును పెట్టారు.

కాగా 13వ తేదికి ఇది తీవ్ర తుపానుగా మారి గుజరాత్ పోర్‌బందర్-మహువా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 120-135కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడమే మంచిదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.