చెన్నై వాసులను ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. బుధవారం చెన్నై నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దీనివలన ఉష్ణోగ్రతలు 27డిగ్రీల సాధారణ స్థితికి చేరుకున్నాయి. జూలై 3వరకు అక్కడ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో నీటి ఎద్దడి, ఉష్ణోగ్రతల నుంచి చెన్నై వాసులకు భారీ ఊరట లభించనుంది. కాగా చెన్నై నగరానికి నీళ్లిందించే ప్రధాన రిజర్వాయర్లు ఎండిపోవడంతో పాటు భూగర్భజలాలు అడుగంటడంతో నగరవాసులు ఇన్ని రోజులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదర్కొన్న విషయం తెలిసిందే.