ఉప్పొంగిన అమిత్ షా, మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లకు ఆమోదం ఒక గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్య, మోదీ, శాస్త్రవేత్తలకి అభినందనలు

|

Jan 03, 2021 | 6:39 PM

భారతదేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లకు డీసీజీఐ తుది ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతోషాన్ని వ్యక్తం చేశారు...

ఉప్పొంగిన అమిత్ షా, మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లకు ఆమోదం ఒక గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్య, మోదీ, శాస్త్రవేత్తలకి అభినందనలు
Follow us on

భారతదేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లకు డీసీజీఐ తుది ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది భారతదేశానికి ఇది ఒక కీలక విజయంగా ఆయన అభివర్ణించారు. సిరమ్‌, భారత్‌ బయోటెక్‌ సంస్థలు తయారుచేసిన కొవిడ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.. భారతదేశాన్ని గర్వించేలా చేసిన మా ప్రతిభావంతులైన, కష్టపడి పనిచేసే శాస్త్రవేత్తలకు నా వందనం అని అమిత్ షా పేర్కొన్నారు. కొవిడ్ రహిత భారతదేశం దిశగా పయనిస్తున్నందుకు ఈ సందర్భంగా అమిత్ షా ప్రధాని నరేంద్రమోదీకి అభినందనలు తెలియజేశారు. ముందుచూపున్న నాయకత్వం దేశంలో భారీ వ్యత్యాసాన్ని చూపించగలదని మోదీ రుజువుచేశారని ఆయన అన్నారు.

కరోనా సంక్షోభ సమయంలో మానవాళికి సహాయం చేయడానికి భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లకు ఆమోదం లభించడం ఒక గేమ్ ఛేంజర్ అని రుజువైందని అమిత్ షా అన్నారు. “ఈ పరీక్షా సమయాల్లో మానవాళికి అంకితభావంతో సేవ చేసిన మా శాస్త్రవేత్తలు, వైద్యులు, వైద్య సిబ్బంది, భద్రతా సిబ్బంది, ఇంకా కరోనా యోధులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” అని చెప్పారు అమిత్ షా. మానవజాతి పట్ల నిస్వార్థంగా చేసిన సేవకు దేశం ఎల్లప్పుడూ వారికి కృతజ్ఞతలు తెలుపుతుందన్నారు. ఇలా ఉండగా, డీసీజీఐ, కొవిషీల్డ్‌తో పాటు కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. దీంతో త్వరలోనే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలుకానుంది.