దక్షిణాది రాష్ట్రాలపై పక్షపాతం.. కాంగ్రెస్ ఎంపీల విమర్శలు

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్డెట్‌లో దక్షిణాది రాష్ట్రాలపై మొండిచేయి చూపారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. 2019-20 కేంద్ర బడ్జెట్‌పై ఆయన స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలకు విద్యా, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చే పథకాలను రూపొందించలేదని పెదవి విరిచారు. దక్షిణాది రాష్ట్రాలు రూపాయి పన్నుచెల్లిస్తుంటే.. తిరిగి కేవలం 65 పైసలు మాత్రమే ఇస్తున్నారన్నారని, దీన్ని చూస్తుంటే ఉత్తరాది నేతల వివక్ష స్పష్టంగా అర్ధమవుతోందని విమర్శించారు. కేంద్ర ఆర్ధిక మంత్రి దక్షిణాది రాష్ట్రానికి […]

దక్షిణాది రాష్ట్రాలపై పక్షపాతం.. కాంగ్రెస్ ఎంపీల విమర్శలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 05, 2019 | 4:25 PM

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్డెట్‌లో దక్షిణాది రాష్ట్రాలపై మొండిచేయి చూపారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. 2019-20 కేంద్ర బడ్జెట్‌పై ఆయన స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలకు విద్యా, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చే పథకాలను రూపొందించలేదని పెదవి విరిచారు. దక్షిణాది రాష్ట్రాలు రూపాయి పన్నుచెల్లిస్తుంటే.. తిరిగి కేవలం 65 పైసలు మాత్రమే ఇస్తున్నారన్నారని, దీన్ని చూస్తుంటే ఉత్తరాది నేతల వివక్ష స్పష్టంగా అర్ధమవుతోందని విమర్శించారు. కేంద్ర ఆర్ధిక మంత్రి దక్షిణాది రాష్ట్రానికి చెందిన వారైనప్పటికీ ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారంటూ రేవంత్ విమర్శించారు.

మరో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ బడ్జెట్ చాలా నిరుత్సాహపరిచిందని.. నిరుద్యోగులు, రైతులు, యువత, పరిశ్రమల వంటి వాటికి ప్రోత్సాహం ఇస్తారని భావిస్తే  దానికి తగ్గట్టుగా బడ్జెట్ లేదని వ్యాఖ్యానించారు. పబ్లిక్ సంస్థల నుంచి కొన్ని పెట్టుబడుల ఉపసంహరణ చేసుకుంటామంటున్నారని ఇది సహేతుకం కాదనే రీతిలో విమర్శలు చేశారు. మొత్తానికి ఈ బడ్జెట్ నిరాశనే మిగిల్చిందన్నారు ఉత్తమ్.